Nandamuri Kalyan Ram: మహిళలను గౌరవించడం మన సంప్రదాయం.. అసెంబ్లీలో జరిగిన ఘటన దురదృష్టకరం: కళ్యాణ్ రామ్

|

Nov 21, 2021 | 10:18 AM

ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై సినీ తారలు స్పందిస్తున్నారు.  తాజాగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ స్పందిస్తూ.. అసెంబ్లీ అనేది దేవాలయంలాంటిది అన్నారు.

Nandamuri Kalyan Ram: మహిళలను గౌరవించడం మన సంప్రదాయం.. అసెంబ్లీలో జరిగిన ఘటన దురదృష్టకరం: కళ్యాణ్ రామ్
Follow us on

Nandamuri Kalyan Ram: ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై సినీ తారలు స్పందిస్తున్నారు.  తాజాగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ స్పందిస్తూ.. అసెంబ్లీ అనేది దేవాలయంలాంటిది అన్నారు. అసెంబ్లీలో జరిగాయని సంఘటన నిజంగా దురదృష్టకరం అన్నారు కళ్యాణ్ రామ్. అసెంబ్లీ అంటే ప్రజాసమస్యల పై పోరాడాలి కానీ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించకూడదు అన్నారు. అసెంబ్లీలో ఎంతోమంది మేధావులు, చదువుకున్నవారు ఉంటారు.. అలాంటి ఒక గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం చాలా బాధాకరమని కళ్యాణ్ రామ్  అన్నారు. ఇది సరైన విధానం కాదని ఆయనఅన్నారు. మహిళలను గౌరవించడం మన సంప్రదాయమని… అలాంటిది అసెంబ్లీలో మహిళలను అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ హుందాగా నడుచుకోవాలని కోరుతున్నానని చెప్పారు.

ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దైవత్వం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు కళ్యాణ్ రామ్. పూజ్యులు రామారావుగారు మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని అందరం ఒక్కసారి గుర్తు చేసుకుందామని అన్నారు. ఇక ఇదే సంఘటన పై హీరో ఎన్ఠీఆర్ మాట్లాడుతూ.. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం.. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణం. ప్రజా సమస్యలపై చర్చ జరగాలి కానీ.. దూషణలు సరికాదని జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఘటన దారుణం అని పేర్కొన్నారు. ఆడవాళ్లను గౌరవించడం మన సంస్కృతి అని చెప్పారు. ఇది మన రక్తంలో ఇమిడిపోయిన సంప్రదాయం అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. తాను ఒక కుటుంబసభ్యుడిగా మాట్లాడటం లేదని, ఒక కొడుకుగా, తండ్రిగా, భర్తగా, దేశ పౌరుడిగా ముఖ్యంగా తెలుగువాడిలా మాట్లాడుతున్నానని తెలిపారు తారక్ .

మరిన్ని ఇక్కడ చదవండి : 

Hyderabad: ఇకపై థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సిందే.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..

ఇండియాలో మొట్టమొదటి ‘లేడీ సూపర్ హీరో’ చిత్రం.. 3డిలో అదరగొట్టనున్న మాజీ మిస్‌ ఇండియా..

Varshini Sounderajan: తన ఒంపుసొంపులతో ఫిదా చేస్తున్న వర్షిణి లేటెస్ట్ పిక్స్