AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా బాలయ్య బంగారం..! హీరోయిన్ పాదాలకు నంస్కరించిన బాలకృష్ణ.. వీడియో వైరల్

నందమూరి నటసింహం, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కీర్తికిరీటంలో మరో ప్రతిష్టాత్మక మైలురాయి చేరింది. భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధానిలో బుధవారం రాత్రి (మార్చి 25, 2026) అత్యంత వైభవంగా ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ 2026’ వేడుకల్లో ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ లభించింది.

మా బాలయ్య బంగారం..! హీరోయిన్ పాదాలకు నంస్కరించిన బాలకృష్ణ.. వీడియో వైరల్
Balakrishna
Rajeev Rayala
|

Updated on: Mar 27, 2026 | 8:35 AM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు బాలయ్య. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయాలు అందుకుంటున్నాయి. వరుసగా 5 సినిమాల విజయంతో టాలీవుడ్ లో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు నటసింహం.. చివరిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. తాజాగా బాలకృష్ణ ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందించారు. అయితే ఈ కార్యకరంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ షో వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది.. నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుకున్నారు

బాలకృష్ణ ఓ హీరోయిన్ పాదాలకు నమస్కరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ ఇలా మరో హీరోయిన్ పాదాలకు నమస్కరించడం పై ఆయన అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. బాలకృష్ణ సంస్కారం చూసి ఆయన అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఎంతైనా మా బాలయ్య బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మొదటిసారి బాలకృష్ణ ఓ హీరోయిన్ పాదాలకు నమస్కరించడం చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆరు నెలల్లోనే ఆ నిర్ణయం తీసుకున్నాం.. విడాకులపై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్

ఓ వైపు సినీ నటుడిగా.. మరో వైపు రాజకీయనాయకుడిగా రాణిస్తున్నారు. హీరోగా విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమానా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరూ కలిసి వీరసింహారెడ్డి సినిమా చేశారు. ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు గోపీచంద్. నయనతార ఈ సినిమాలో హీరోయన్ గా నటిస్తుంది.

ఆ హీరోను చూస్తే ఇప్పటికీ అసహ్యం వేస్తుంది.. అతను చేసిన పనికి అంటూ సీరియస్ అయిన విజయశాంతి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us