Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BB3 Movie : అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బాలయ్య.. ‘అఖండ’గా రానున్న నటసింహం.. టీజర్ విడుదల

Akhanda movie : నందమూరి నట సింహం బాలకృష్ణ  ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు బిబి3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

BB3 Movie : అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బాలయ్య.. 'అఖండ'గా రానున్న నటసింహం.. టీజర్ విడుదల
Balakrishna
Follow us
Rajeev Rayala

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 13, 2021 | 1:31 PM

Balakrishna – Boyapati Srinu film:  నందమూరి నట సింహం బాలకృష్ణ  ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  బిబి3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు బిబి 3 టైటిల్ తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరో  వైపు బోయపాటి కూడా ఫ్యాన్స్ అంచనాలకు ఎక్కడ తగ్గకుండా తెరకెక్కిస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ‘బీబీ3’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న చిత్రానికి తమన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 28 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఉగాది పర్వధినాన్ని పురస్కరించుకొని బాలయ్య సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ఈ మేరకు టీజర్ ను విడుదల చేశారు.  గత సినిమాల మాదిరిగానే ఈసినిమాకు కూడా ‘అఖండ’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఎంచుకున్నాడు బోయపాటి. ఇక ఈసినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం  చేయబోతున్నారు. అందులో ఒకటి అఘోర పాత్ర. ఇక ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. బాలయ్యకు జోడీగా కంచె బ్యూటీ ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.  ఈ సినిమా తర్వాత క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Acharya Movie: నీలాంబరితో సిద్ధ సరసాలు.. ఆకట్టుకుంటున్న ఆచార్య మూవీ న్యూ పోస్టర్..

Nabha Natesh: నభా నటేష్ లేటెస్ట్ ఫోటో షూట్… కేక పుట్టిస్తోన్న ఇస్మార్ట్ పోరి ఇన్‌స్టాగ్రామ్ ఫోటో గ్యాలెరీ…