AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acharya Movie: నీలాంబరితో సిద్ధ సరసాలు.. ఆకట్టుకుంటున్న ఆచార్య మూవీ న్యూ పోస్టర్..

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. సోషల్ మేసెజ్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల. ఈ చిత్రంలో చిరంజీవి గవర్నమెంట్ ఆఫీసర్ గాను నక్సలైట్ గాను కనిపించనున్నారని

Acharya Movie: నీలాంబరితో సిద్ధ సరసాలు.. ఆకట్టుకుంటున్న ఆచార్య మూవీ న్యూ పోస్టర్..
Acharya
Rajeev Rayala
|

Updated on: Apr 13, 2021 | 11:46 AM

Share

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. మంచి సోషల్ మేసెజ్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల. ఈ చిత్రంలో చిరంజీవి దేవాదాయ శాఖ ఆఫీసర్ గాను, నక్సలైట్ గాను రెండు విభిన్న పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. ఇక చిరు సరసన చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ పాత్ర  ఆచార్యలో దాదాపు 40నిమిషాలకు పైగా ఉండనుందని అంటున్నారు. ఇటీవలే చిరు- చరణ్ లపై కీలక సన్నివేశాలను పూర్తి చేశారు కొరటాల.

ఈ మధ్య చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ విడుదల చేసిన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పోస్టర్ లో చిరు, చరణ్ ఇద్దరు నక్సలైట్స్ గెటప్ లో కనిపించరు. తాజాగా ఉగాది సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ మరో పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో రామ్ చరణ్- పూజాహెగ్డే ఉన్నారు. చరణ్ పూజతో ఉన్న రొమాంటిక్ ఫోటోను రిలీజ్ చేశారు. ఈపోస్టర్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటుంది. షడ్రుచుల సమ్మేళనం సిద్ధ, నేలంబరిలా ప్రేమ అంటూ ఈ పోస్టర్ కు క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటికే ఆచార్య లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేశారు చరణ్. మరో వైపు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nabha Natesh: నభా నటేష్ లేటెస్ట్ ఫోటో షూట్… కేక పుట్టిస్తోన్న ఇస్మార్ట్ పోరి ఇన్‌స్టాగ్రామ్ ఫోటో గ్యాలెరీ…

Venkatesh’s Narappa Movie : కుటుంబ సమేతంగా ఉగాది శుభాకాంక్షలు తెలిపిన నారప్ప..

RRR Movie: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా