Nandamuri Balakrishna: నటసింహం మంచి మనసుకు మరో ఉదాహరణ.. టర్కీలో బాలయ్య చేసిన పనికి అంతా ఫిదా

నటసింహం నందమూరి బాలకృష్ణ మంచి మనసు గురించి చాలా మందికి తెలియక పోవచ్చు.. పలు సందర్భాల్లో ఆయన ఫ్యాన్స్ పైన చేయి చేసుకోవడం చూసి కొంతమంది ఆయనకు ఆవేశం ఎక్కువ అనుకుంటూ ఉంటారు. కానీ

Nandamuri Balakrishna: నటసింహం మంచి మనసుకు మరో ఉదాహరణ.. టర్కీలో బాలయ్య చేసిన పనికి అంతా ఫిదా
Nandamuri Balakrishna

Edited By: Basha Shek

Updated on: Sep 01, 2022 | 1:23 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)మంచి మనసు గురించి చాలా మందికి తెలుసు.. పలు సందర్భాల్లో ఆయన ఫ్యాన్స్ పైన చేయి చేసుకోవడం చూసి కొంతమంది ఆయనకు ఆవేశం ఎక్కువ అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆయన చాలా సరదా మనిషి. అలాగే వెన్నెలంటి మనసున్న మనిషి. చాలా సందర్భాల్లో బాలయ్య తన మంచి మనసును చాటుకున్నారు. అసలు బాలయ్య రూటే సపరేటు.. ఆయనకు అభిమానులంతే అమితమైన ఇష్టం. చాలా మందితో ఆయన ఫోన్ లో మాట్లాడటం కూడా మనకు తెలుసు. తాజాగా బలాయ్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మా బాలయ్య బంగారం అనకుండా ఉండలేము.

ఇటీవలే బాలకృష్ణ తన అభిమాని కుటుంబంతో కలిసి భోజనం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన ఇదే పని చేశారు. అయితే బాలయ్య ఇటీవల సినిమా షూటింగ్ కోసం టర్కీకి వెళ్లారు. అక్కడ ఓ కుటుంబంతో కలిసి టిఫిన్ చేసి.. వారితో కాసేపు సరదాగా కబుర్లు చెప్పారు బాలయ్య. “హేభాయ్ టిఫిన్ చేసేసా.. ఇక మందులు వేసుకోవాలి అంటూ బాలయ్య నవ్వుతూ కబుర్లు చెప్పారు. ఆడవాళ్లు ఇంట్లో కూర్చుని టీవీ సీరియళ్లు చూస్తూ మెదడు పాడు చేసుకుంటారు. నా ఉద్దేశం ప్రకారం టీవీ తక్కువ చూస్తే కళ్లకు మంచిది. అసలు చూడకపోతే మెదడుకి మంచింది అని సరదాగా మాట్లాడారు బాలకృష్ణ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి