Nandamuri Balakrishna: మా బాలయ్య బంగారం.. అభిమాని కోసం ఏం చేశారో తెలిస్తే శభాష్ అంటారు..
అభిమాని అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకుని చలించిపోయిన నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. వెంటనే చికిత్సకు అవసరమయ్యే డబ్బును ప్రభుత్వం ద్వారా అందేలా చేశారు. అదేంటో..? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి. మీరూ ఓసారి ఈ స్టోరీ పై లుక్కేయండి.

తన అభిమానులు ఆపదలో ఉంటే తట్టుకోలేరు నందమూరి బాలకృష్ణ. సమాచారం ఇలా అందుకోవడం చాలు.. ఠక్కున తానున్నానని భరోసా ఇస్తూ సాయం చేస్తారు బాలకృష్ణ. ఇటీవల తన అభిమాని ఒకరు అనారోగ్యానికి గురైతే.. మా మంచి బాలయ్య చొరవ తీసుకుని మరీ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం అందేలా చేశారు. ఆ వివరాలు ఇలా..
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన బద్రి స్వామి అనే వ్యక్తి.. నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని. ఇటీవల కాలంలో బద్రి స్వామి అనారోగ్యానికి గురయ్యాడు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకునేందుకు అతడు ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ తన అభిమాని బద్రి స్వామికి చికిత్స అందించేందుకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అతడికి 10 లక్షల రూపాయలు అందేలా చొరవ చూపారు.
చికిత్సకు 20 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఆర్థిక సమస్యల కారణంగా చికిత్స చేయించుకోలేక బద్రి స్వామి ఇబ్బంది పడ్డాడు. ఈ విషయాన్ని ఆదోని నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు బాలయ్య దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే స్పందించిన బాలకృష్ణ ప్రభుత్వం ద్వారా 10 లక్షలు ఎల్ఓసి మంజూరు చేయించారు. సంబంధిత ఎల్ఓసి మంజూరు పత్రాన్ని బాలకృష్ణ సతీమణి వసుంధర అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు ఆదోని అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు. అభిమాని అనారోగ్యంతో ఉండటం చికిత్స చేయించుకోలేక ఆపదలో ఉండటాన్ని గుర్తించి స్పందించి సహాయం అందించడం పట్ల బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




