Nandamuri Balakrishna: మన మధ్య ఆయన లేరనే వార్త తనను కలచివేసింది.. బీఏ రాజు మృతిపట్ల ఎమోషనల్ అయిన బాలయ్య…

సినీపరిశ్రమలో వరుస విషాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా ప్రముఖులు కన్నుమూశారు. మరికొంతమంది అనారోగ్యం కారణంగా..

Nandamuri Balakrishna: మన మధ్య ఆయన లేరనే వార్త తనను కలచివేసింది.. బీఏ రాజు మృతిపట్ల ఎమోషనల్ అయిన బాలయ్య...

Updated on: May 22, 2021 | 2:36 PM

nandamuri balakrishna : సినీపరిశ్రమలో వరుస విషాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా ప్రముఖులు కన్నుమూశారు. మరికొంతమంది అనారోగ్యం కారణంగా మృతిచెందారు. తాజాగా సినీ నిర్మాత, పీఆర్వో బీఏ రాజు అనారోగ్యంతో మృతిచెందారు చెందారు. బీఏ రాజు మరణం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బీఏ రాజు మృతి పట్ల ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ సంతాపాన్ని తెలియజేశారు. బీఏ రాజు మృతిపై బాలయ్య ఎమోషనల్ అయ్యారు. ఆయనతో తనకు ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉందని అన్నారు. మన మధ్య ఆయన లేరనే వార్త తనను కలచి వేసిందని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

హీరో విశాల్ మాట్లాడుతూ… తన కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి రాజుగారు తనను ఎంతో ప్రోత్సహించారని చెప్పారు. తనకు అండగా నిలిచిన సోదరుడు, స్నేహితుడైన రాజు ను కోల్పోవడం చాలా బాధాకరం అన్నారు. రాజు గారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని మహేశ్ బాబు చెప్పారు. తన చిన్నతనం నుంచి ఆయన తనకు తెలుసని అన్నారు. తమ కుటుంబానికి ఆయన ఎంతో ఆప్తుడని… ఆయనకు తామే ప్రపంచమని చెప్పారు. ఆయన మరణం సినీ పరిశ్రమకే కాకుండా… తమ కుటుంబానికి కూడా పెద్ద లోటు అని అన్నారు. బీఏ రాజు గుండెపోటుతో నిన్న అర్ధరాత్రి కన్నుమూశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Veturi Sudararamamurthy : పాటలమ్మ కంఠ హారానికి పదాల వజ్రాలను పొదిగిన పదశిల్పి వేటూరి

Manchu Lakshmi: మంచి మ‌న‌సు చాటుకున్న మంచు ల‌క్ష్మి… క‌రోనాతో మ‌ర‌ణించిన వారి చిన్నారుల‌కు అండ‌గా..

RGV Tweet: ప్ర‌భుత్వాలు ఫార్మా కంపెనీల‌కు ఫండ్స్ ఇవ్వ‌డం మానేసి.. ఆనంద‌య్య‌కు ఇవ్వాలి! వ‌ర్మ మార్క్ కామెంట్స్‌..