Jr. NTR Political Entry: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన మళ్లీ టీడీపీలోకి రావాలని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం పలు సందర్భాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఇక తాజాగా ఈ అంశంపై నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా టీవీ9కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా.? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ ”ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్లవి. ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తారా.? లేదా.? అనే విషయాన్ని నేను పెద్దగా ఆలోచించడం లేదని” బాలకృష్ణ పేర్కొన్నారు. ఒకవేళ ఎన్టీఆర్ పాలిటిక్స్‌లోకి వస్తే.. అది పార్టీకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారా.? అని అడగ్గా.. నవ్వుతూ రాజకీయాల్లోకి వచ్చి ప్లస్ అయి.. తర్వాత మైనస్ అయితే అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఓ ఆవేశంలో నుంచి పుట్టిందని.. పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పుడూ పారదర్శకంగా ఉంటారని తెలిపారు. ఇక అలాంటివరికే పార్టీలో సముచిత స్థానం ఉంటుందని బాలకృష్ణ వివరించారు.
Also Read:
పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!
ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..