AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nana Patekar: “దయచేసి నన్ను క్షేమించండి.. ఇక పై అలా చేయను”.. వీడియో వదిలిన నానాపటేకర్

తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించాడు. నానా పటేకర్ కు వివాదాలు కొత్తేమి కాదు. గతంలో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలలో కూడా చిక్కుకున్నాడు. చాలా మంది నానా పటేర్ పై ఆరోపణలు చేశారు.  తాజాగా నానా పటేకర్ తనతో ఫోటో దిగేందుకు వచ్చిన ఓ కుర్రాడి పై చేయిచేసుకున్నారు. ఈ చర్యపై అందరి నుంచి విమర్శలు రావడంతో నానా పటేకర్ క్షమాపణలు చెప్పారు.

Nana Patekar: దయచేసి నన్ను క్షేమించండి.. ఇక పై అలా చేయను.. వీడియో వదిలిన నానాపటేకర్
Nana Patekar
Rajeev Rayala
|

Updated on: Nov 16, 2023 | 12:21 PM

Share

నటుడు నానా పటేకర్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ అభిమానిని కొట్టి న్యూస్ లోకి ఎక్కాడు నానా పటేకర్. విలక్షణ నటనతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు బాలీవుడ్ నటుడు నానా పటేకర్. తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించాడు. నానా పటేకర్ కు వివాదాలు కొత్తేమి కాదు. గతంలో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలలో కూడా చిక్కుకున్నాడు. చాలా మంది నానా పటేర్ పై ఆరోపణలు చేశారు.  తాజాగా నానా పటేకర్ తనతో ఫోటో దిగేందుకు వచ్చిన ఓ కుర్రాడి పై చేయిచేసుకున్నారు. ఈ చర్యపై అందరి నుంచి విమర్శలు రావడంతో నానా పటేకర్ క్షమాపణలు చెప్పారు.

‘ఫోటోలు ఇవ్వను అని ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది. దయచేసి నన్ను క్షేమించండి. ఇకపై ఇలా చేయను. నేను నేరుగా అబ్బాయికి క్షమాపణలు చెప్పాను. కానీ భయంతో పారిపోయాడు’ అని చెప్పాడు నానా పటేకర్. క్షమాపణలు కోరుతూ వీడియోను విడుదల చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నానా పటేకర్ ‘జర్నీ’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ వారణాసిలో జరుగుతోంది. షూటింగ్‌లో బిజీగా ఉన్న సమయంలో ఓ అభిమాని నానా పటేకర్‌తో సెల్ఫీ దిగేందుకు వచ్చాడు. అప్పుడు నానా పటేకర్ కి చాలా కోపం వచ్చింది. సెల్ఫీ అడిగేందుకు వచ్చిన బాలుడి తలపై మొబైల్ ఫోన్ తో కొట్టాడు. వెంటనే సెట్‌లో ఉన్న మిగతా సిబ్బంది బాలుడి మెడ పట్టుకుని బయటకు నెట్టారు. దీన్ని నెటిజన్లు మండిపడుతున్నారు.

వీడియో వైరల్ కావడంతో, ‘జర్నీ’ బృందం ‘ఇది సినిమాలోని సన్నివేశం’ అని ప్యాచ్ చేసింది. ‘నేను ఓ అబ్బాయిని కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. అది మా సినిమా షూటింగ్ సన్నివేశం. ఓ పెద్దాయన.. టోపీలు అమ్ముతావా అని ఓ కుర్రాడు వచ్చి అడిగే సన్నివేశం అది. నేను సీన్ లో అతనిని కొట్టాలి. మేము దానిని రిహార్సిల్ చేస్తున్నాము. రెండో రిహార్సల్ సమయంలో ఈ అబ్బాయి వచ్చాడు. అతను మా టీమ్‌కి చెందినవాడని అనుకున్నాను. కానీ అతను ఎవరో. నేను పొరపాటున కొట్టేశాను.  వెంటనే అతడు పారిపోయాడు. ఈ వీడియోను ఆ అబ్బాయి స్నేహితులు చిత్రీకరించారని నానా పటేకర్ తెలిపారు. నానా పటేకర్‌ హిందీ చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్నాడు. సపోర్టింగ్ రోల్స్‌తో పాటు అన్ని రకాల పాత్రల ద్వారా ప్రేక్షకులఅలరించారు. ఇటీవల విడుదలైన ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

నానా పటేకర్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లేటెస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.