
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించనున్న ఈ సినిమా ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతుంది. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు చాలా రోజుల క్రితమే జరగ్గా.. ఇప్పటివరకు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంది. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుంతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ముందు నుంచి చెబుతున్నట్లుగానే ఈ ప్రాజెక్ట్ సెప్టెంబర్ రెండోవారంలోనే అంటే ఈ వారంలోనే స్టార్ట్ కాబోతుందని వార్తలు వినిపించాయి. తాజాగా సూపర్ స్టార్ అభిమానులకు మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఎస్ఎస్ఎంబీ 28 సెట్ నుంచి మహేష్ ఫోటో షేర్ చేశారు.
లేటేస్ట్ ఫోటోలో మహేష్ మరింత స్టైలీష్ గా ఉన్నారు. కాస్త్ రఫ్ అండ్ మాస్ లుక్… సీరియస్‌గా చూస్తూ ఛార్మింగ్ లుక్‌లో ఉన్నారు. ప్రస్తుతం మహేష్ న్యూలుక్ ఫోటో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. హైదరాబాద్ లోని ఆర్ఎఫ్సీలో యాక్షన్ ఎపిసోడ్ తో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించిన కీలకసభ్యులు సెట్స్ లో చేరనున్నారు. ఇందులో మహేష్ సరసన పూజాహెగ్డే నటించనుండగా.. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించనున్నారు.
నమ్రత ఇన్ స్టా పోస్ట్..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.