టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కుటుంబం పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ సినీ ప్రముఖులు, స్టార్ హీరోస్, దర్శకనిర్మాతలు మండిపడుతున్నారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ మాట్లాడారని కోర్టును ఆశ్రయించారు అక్కినేని నాగార్జున. ఆమెపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. అలాగే ఆమె పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు. ఈ కేసుపై నేడు కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. కానీ న్యాయముర్తి సెలవులో ఉండడంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసుపై అక్టోబర్ 7న విచారణ జరుగుతుందని న్యాయస్థానం తెలిపింది.
మరోవైపు కొండా సురేఖ వ్యాఖ్యలపై చిరంజీవి, నాగార్జున, ఆర్జీవి, నాగచైతన్య, అఖిల్, అమల అక్కినేని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా డైరెక్టర్ రాజమౌళి కూడా కొండ సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు సహించలేనివి అంటూ ట్వీట్ చేశారు. ఎక్కడా కూడా కొండా సురేఖ పేరు కానీ.. ఇటు అక్కినేని ఫ్యామిలీ పేర్లు కానీ ఉపయోగించకుండా ట్వీట్ చేశారు రాజమౌళి.
“హుందాతనాన్ని నిలబెట్టుకోండి. గౌరవప్రదంగా వ్యవహరించండి. ఇలాంటి నిరాధార ఆరోపణలు సహించలేనివి. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ప్రతినిధులు చేసినప్పుడు” అంటూ రాసుకొచ్చారు. దీనికి #FilmIndustryWillNotTolerate అనే ట్రెండింగ్ ట్యాగ్ జోడించారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది. మరోవైపు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ సినీ తారలు ఫైర్ అవుతున్నారు.
రాజమౌళి ట్వీట్..
Respect boundaries, maintain dignity. Baseless allegations are intolerable, especially when made by public officials!#FilmIndustryWillNotTolerate
— rajamouli ss (@ssrajamouli) October 3, 2024
కొండా సురేఖ వ్యాఖ్యలు..
కొందరు హీరోయిన్స్ త్వరగా పెళ్లి చేసుకుని కెరీర్ ముగించడానికి, నాగార్జున ఫ్యామిలీలో జరిగిన కొన్ని పరిస్థితులకు కేటీఆర్ కారణమని అన్నారు. దీంతో ఇండస్ట్రీతోపాటు పలు రాజకీయ పార్టీల నేతలు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఓ మంత్రి స్థానంలో ఉన్న మహిళ ఇలా మాట్లాడటం సిగ్గు చేటు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు చెబుతూ సమంతకు క్షమాపణలు కూడా చెప్పారు కొండా సురేఖ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.