Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. పోలీసుల అదుపులో మరో 16 మంది

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్‌చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. పల్లవి ప్రశాంత్‌పై మొత్తం 9 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయ్‌. ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడు రాజు, మరికొందరిపై కేసులు పెట్టారు పోలీసులు. దాంతో, బిగ్‌బాస్‌ విన్నర్‌గా బయటకు అడుగులు వేసిన ప్రశాంత్‌ ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటివరకు జేజేలు పలికిన వాళ్లే.. ఇదేం పని ప్రశాంత్‌ అనే పరిస్థితి వచ్చింది.

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. పోలీసుల అదుపులో మరో 16 మంది
Pallavi Prashanth
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 21, 2023 | 4:01 PM

మితిమీరితే ఏదైనా ప్రమాదకరమే.. పల్లవి ప్రశాంత్ విషయంలోనూ అదే జరిగింది. బిగ్‌బాస్‌ ఫైనల్‌ రోజున హైదరాబాద్‌ రోడ్లపై విధ్వంసానికి, అల్లర్లకు కారణమైన పల్లవి ప్రశాంత్‌ తిక్క కుదిర్చారు పోలీసులు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్‌చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. పల్లవి ప్రశాంత్‌పై మొత్తం 9 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయ్‌. ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడు రాజు, మరికొందరిపై కేసులు పెట్టారు పోలీసులు. దాంతో, బిగ్‌బాస్‌ విన్నర్‌గా బయటకు అడుగులు వేసిన ప్రశాంత్‌ ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటివరకు జేజేలు పలికిన వాళ్లే.. ఇదేం పని ప్రశాంత్‌ అనే పరిస్థితి వచ్చింది.

బిగ్‌బాస్ హౌస్‌లో ఎంత డ్రామా ఉంటుందో.. టైటిల్‌ గెలిచిన తర్వాత అంతకుమించిన హైడ్రామా నడిచింది. పల్లవి ప్రశాంత్‌ అరెస్ట్‌ విషయంలో కూడా పెద్ద డ్రామా జరిగింది. చివరికి బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఓన్‌ హౌస్‌కి వెళ్లిన పల్లవిని… ఇప్పుడు జైలర్‌ హౌస్‌కి తరలించారు పోలీసులు. ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్ట్ లో విచారణ జరిగింది. పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ వాదిస్తూ.. అక్కడ జరిగిన గొడవ కు పల్లవి ప్రశాంత్ కు ఎలాంటి సంబంధం లేదు. నిన్న మధ్యాహ్నం 2 నుండి అక్కడ జనాలు గుమి కూడి ఉన్నారు. పల్లవి ప్రశాంత్ బయటికి ఒచ్చింది రాత్రి 10:30 గంటల తరువాతే..మధ్యాహ్నం నుండి పోలీసులు అక్కడే ఉండి మాబ్ ను కంట్రోల్ చేయలేకపోయారు. సంబంధం లేకున్నా పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడికి బెయిల్ మంజూరు చేయాలి అని తన వాదన వినిపించారు.

అదే విధంగా పిపి వాదిస్తూ.. పల్లవి ప్రశాంత్ బయటికి వచ్చాకే వారి అనుచరులు గొడవ చేశారు అని అన్నారు. అదే విధంగా డీసీపీ స్థాయి అధికారి అక్కడికి వచ్చి బతిమలాడినా మాబ్ వినలేదు. అక్కడ ఉన్న ఆర్టీసి బస్సులను ధ్వంసం చేశారు, పోలీస్ వాహనాలు పై దాడి చేశారు, పోలీసుల పై రాళ్ళు రువ్వారు. ప్రస్తుతం ఏ 3 ఇంకా పరారీలో ఉన్నాడు. వీరికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారు అని వాదించారు. ముగిసిన ఇరు పక్షాల వాదనలు, పల్లవి ప్రశాంత్ బెయిల్ పై తీర్పు రేపటికి వాయిదా వేసింది న్యాయస్థానం. మరో వైపు.. బిగ్ బాస్ 7 ఫైనల్ గొడవ పై మరో 16 మంది అరెస్టు చేశారు పోలీసులు. బస్సులు, పోలీసు వాహనాలపై దాడికి పాల్పడిన వారిలో 16 మందిని గుర్తించారు. ఇందులో 12 మంది మేజర్లు, నలుగురు మైనర్లు అరెస్టు చేశారు. మరి కాసేపట్లో కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.