Anshu Ambani: ఆ కారణంగానే విసుగెత్తి సినిమాలకు దూరమయ్యాను.. ‘మన్మథుడు’ హీరోయిన్ కామెంట్స్..
ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీలో ఆమె కనిపించింది తక్కువ సమయమే అయినా.. ఇప్పటికీ అడియన్స్ మనసులలో చెరగని స్థానం సంపాదించుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ అందుకుంది. మన్మథుడు తర్వాత అన్షుకు తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ వెంటనే రాఘవేంద్ర సినిమాలో కనిపించింది.. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ మూవీలో అన్షు హీరోయిన్. ఇక తర్వాత మిస్సమ్మ సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది.

‘నేను నేనుగ లేనే నిన్న మొన్న లా.. లేని పోని ఊహల్లో ఎమిటో ఇలా.. ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా.. ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా’ అంటూ ఒక్క పాటతోనే తెలుగు సినీ పరిశ్రమలో సెన్సెషన్ అయిన హీరోయిన్ అన్షు అంబానీ. అమాయకపు చూపులతో.. ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి అప్పట్లో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ఒకప్పుడు ఆమెకు యూత్‌లో యమ ఫాలోయింగ్ ఉండేది. అక్కినేని నాగార్జున నటించిన ‘మన్మథుడు’ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీలో ఆమె కనిపించింది తక్కువ సమయమే అయినా.. ఇప్పటికీ అడియన్స్ మనసులలో చెరగని స్థానం సంపాదించుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ అందుకుంది. మన్మథుడు తర్వాత అన్షుకు తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ వెంటనే రాఘవేంద్ర సినిమాలో కనిపించింది.. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ మూవీలో అన్షు హీరోయిన్. ఇక తర్వాత మిస్సమ్మ సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది. 2004లో జై అనే తమిళ చిత్రంలో చివరిసారిగా నటించింది. అయితే తెలుగులో ఆమెకు అవకాశాలు వచ్చినప్పటికీ అన్నింటిని రిజెక్ట్ చేసి సినిమాలకు దూరంగా ఉండిపోయింది.
2003లో సచిన్ సాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని లండన్ లో సెటిలైంది. అయితే తాజాగా తన వ్యక్తిగత పనిపై భారత్ వచ్చిన అన్షు..ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె మాట్లాడుతూ.. సినిమాలకు దూరమవ్వడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కెమెరా ముందుకు వచ్చిన అన్షు.. తన పర్సనల్ విషయాలను బయటపెట్టింది. కొన్ని కారణాలతోనే సినిమాలపై విసుగొచ్చి ఇండస్ట్రీకి దూరమయ్యాయని చెప్పుకొచ్చింది.
ఇంగ్లాండ్ లో పుట్టిన పెరిగిన అన్షు.. 16 ఏళ్ల వయసులో ఇండియాకు వచ్చానని.. ఆ సమయంలోన తనకు మన్మథుడు సినిమాలో ఆఫర్ వచ్చిందని తెలిపింది. ఓవైపు సినిమాలు.. మరోవైపు చదువుపైనా దృష్టి పెట్టాలనుకుంది. తెలుగులో చేసిన రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గానే ఛాన్స్ వచ్చిందని.. ఆ రెండు పాత్రలు చనిపోతాయని.. ఆ తర్వాత వచ్చిన రెండు మూడు సినిమాల్లోనూ ఇలా చనిపోయే రోల్స్ వచ్చాయని.. పదే పదే అలాంటి పాత్రలే వస్తుంటే విసుగెత్తిపోయానని.. అందుకు బదులుగా ఖాళీగా ఉండడమే బెటర్ అనిపించి ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది. ఒక పాత్ర సరిగ్గా చేశారని.. ప్రతిసారి అలాంటి పాత్రలే రావడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




