AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న నాగార్జున.. ప్రపంచ యుద్దం నేపథ్యంలో వెబ్ సిరీస్..

2019లో వచ్చిన మన్మధుడు 2 తర్వాత కింగ్ నాగార్జున నుంచి ఎలాంటి మూవీ రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు

Nagarjuna: ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న నాగార్జున.. ప్రపంచ యుద్దం నేపథ్యంలో వెబ్ సిరీస్..
Nagarjuna
Rajitha Chanti
|

Updated on: Mar 25, 2021 | 9:46 PM

Share

2019లో వచ్చిన మన్మధుడు 2 తర్వాత కింగ్ నాగార్జున నుంచి ఎలాంటి మూవీ రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు నాగ్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. విడుదల తేదీని దగ్గరి వస్తున్న క్రమంలోనే ప్రమోషన్స్‏ను కూడా పెంచేశారు చిత్రయూనిట్. ఈ సినిమా సనీ ప్రియులకు ఆకట్టుకుంటుదని నాగార్జున నమ్మకం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే నాగార్జున రెండు భారీ ప్రాజెక్టులతో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. వాటిలో ఒకటి రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో వస్తున్న వెబ్ సిరీస్ కాగా, మరొకటి 1980 నుంచి నేటి కాలం వరకు జరిగిన పరిణామాల ఆధారంగా నిర్మిస్తున్నారు. వీటికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. అశిసోర్ సోలమన్ దర్శకత్వం వహించిన వైల్డ్ డాగ్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ డియా మీర్జా హీరోయిన్‏గా నటిస్తోంది. అలాగే సయామీ ఖేర్, అలీ రెజా, అతుల్ కులకర్ణి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కొరియోగ్రాఫర్లు, షామ్ కౌషల్, డేవిడ్ ఇస్మలోన్ ఈ చిత్రానికి స్టంట్స్ కంపోజ్ చేయగా, ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. షనీల్ డియో సినిమాటోగ్రాఫర్‏గా వ్యవహరించారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఉగ్రవాద బాంబు దాడుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఇందులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫీసర్‏గా నాగ్ కనిపించనున్నారు. ప్రస్తుతం నాగార్జున.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో కాజల్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది.

Also Read:

రష్మికతో కలిసి డిన్నర్‏కు వెళ్లిన విజయ్ దేవరకొండ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..

శుక్రవారమే ‘రంగ్ దే’ గ్రాండ్ రిలీజ్.. అందమైన పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. మరీ ఈసారైన నితిన్ హిట్ కొడతాడా ?

Follow Us
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి