కన్నడ స్టార్ హీరో సుదీప్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ విక్రాంత్ రోణ(Vikrant Rona). భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 28న ఈ త్రీడీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.ఈ సినిమాను అనూప్ భండారి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో జాక్వలైన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ సమర్పణలో జీ స్టూడియోస్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉత్తరాదిన రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని షాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్ నిర్మించారు. ఇన్‌వెనియో ఆరిజన్స్ బ్యానర్‌పై అలంకార్ పాండియన్ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. కిచ్చా సుదీప్, అనూప్ అందరూ నా పాత సినిమాలను గుర్తు చేశారు. సుదీప్.. కన్నడ అబ్బాయి కాదు తెలుగువాడే. తను హైదరాబాద్‌లోనే ఉంటాడు అన్నారు నాగ్. సుదీప్ ఇప్పటికే హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించేశారు. ఇప్పుడు విక్రాంత్ రోణ అనే ఒకే చిత్రంతో అన్ని భాషల ప్రేక్షకులను పలకరించబోతున్నారు. సాధారణంగా ఇక్కడ ఈ సినిమా తీశారు అని గర్వంగా ఫీలై పెద్ద పెద్ద పోస్టర్స్ పెడతాం. ఇంతకు ముందు బాహుబలి, ఆర్ఆర్ఆర్ పెట్టాం. విక్రాంత్ రోణ ట్రైలర్ రిలీజ్ తర్వాత చూసి అన్నపూర్ణలో పెద్ద పోస్టర్ పెట్టేస్తారనిపించింది. ట్రైలర్ అదిరిపోయింది. సినిమాను త్రీడీలో తీశారని అంటున్నారు. కచ్చితంగా ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. మా తెలుగు ఆడియెన్స్‌ది చాలా మంచి మనసు. ఎందుకంటే మా వాళ్లకు సినిమా నచ్చిందంటే తీసుకెళ్లి నెక్స్ట్ లెవల్ లో పెడతారు. విక్రాంత్ సినిమాతో ఆ ఎక్సపీరియెన్స్‌ను మరోసారి చూడబోతున్నారు. సినిమా సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు నాగార్జున.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి