The Ghost: నాగార్జున ఘోస్ట్ సినిమా ఓటీటీకి వచ్చేది అప్పుడేనా.. స్టీమింగ్ ఎక్కడంటే..

ఓ వైపు బిగ్ బాస్ రియాలిటీ షోను హోస్ట్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తున్నారు. రీసెంట్‌గా ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగ్.

The Ghost: నాగార్జున ఘోస్ట్ సినిమా ఓటీటీకి వచ్చేది అప్పుడేనా.. స్టీమింగ్ ఎక్కడంటే..
Nagarjuna Ghost Movie
Follow us

|

Updated on: Oct 07, 2022 | 4:31 PM

టాలీవుడ్‌లో యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్న సీనియర్ హీరో ఎవరు అంటే టక్కున చెప్పే పేరు కింగ్ నాగార్జున. అదే ఫిట్ నెస్, అదే గ్లామర్‌తో ఆకట్టుకుంటున్నారు నాగ్. ఓ వైపు బిగ్ బాస్ రియాలిటీ షోను హోస్ట్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తున్నారు. రీసెంట్‌గా ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగ్. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నాగార్జున రా ఏజెంట్‌గా నటించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలిచాయని అంటున్నారు చూసిన ప్రేక్షకులు.

ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన హాట్ బ్యూటీ సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికర విషయం ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఘోస్ట్ సినిమా ఓటీటీకి వచ్చేది అప్పుడే అంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఘోస్ట్ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుందని క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమా సరిగ్గా ఎనిమిది వారాలకు అంటే డిసెంబర్ మొదటి వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ అవ్వనుందని తెలుస్తోంది.

ఇప్పటికే థియటర్స్ లో ఘోస్ట్ సినిమా దూసుకుపోతోంది దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాకు పోటీగా రిలీజ్ అయ్యింది. గాడ్ ఫాదర్ సినిమా పొలిటికల్ స్టోరీకాగా ఘోస్ట్ సినిమా సస్పెన్స్ థ్రిలర్ గా తెరకెక్కింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..