అక్కినేని నాగార్జున ఫుల్ జోష్ గా దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో జోరుమీదున్న నాగార్జున రీసెంట్ గా ది ఘోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాను తెరకెక్కించారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున రా ఏజెంట్ గా కనిపించారు. ఇక ఘోస్ట్ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నాగార్జున నటన, యాక్షన్ సీక్వెన్స్ లు హైలైట్ గా నిలిచాయని అంటున్నారు ప్రేక్షకులు. ఈ మూవీలో నాగ్ కు జోడిగా సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని ‘శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి’, ‘నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్’ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఈ సినిమా దసరా కానుకగా విడుదలైంది. ఇక ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ తోపాటు మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ది ఘోస్ట్ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే డీసెంట్ ఓపినింగ్స్ రాబట్టింది. అలాగే రెండో రోజుకూడా ఈ మూవీ మంచి వసూళ్లను సాధిస్తోంది.
నైజాం 0.79 కోట్లు, సీడెడ్ 0.39 కోట్లు, ఉత్తరాంధ్ర 0.47 కోట్లు, ఈస్ట్ 0.28 కోట్లు, వెస్ట్ 0.12 కోట్లు, గుంటూరు 0.27 కోట్లు, కృష్ణా 0.23 కోట్లు, నెల్లూరు 0.17 కోట్లు, ఏపీ – తెలంగాణ (టోటల్) 2.72 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.23 కోట్లు, ఓవర్సీస్ 0.35 కోట్లు, వరల్డ్ వైడ్ (టోటల్) 3.30 కోట్లు రాబట్టింది ఘోస్ట్ మూవీ.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..