Bangarraju: యూట్యూబ్‏లో బంగార్రాజు మేనియా.. ట్రెండింగ్‏లో దూసుకుపోతున్న ట్రైలర్..

అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం బంగార్రాజు. ఇందులో అక్కినేని నాగచైతన్య,

Bangarraju: యూట్యూబ్‏లో బంగార్రాజు మేనియా.. ట్రెండింగ్‏లో దూసుకుపోతున్న ట్రైలర్..
Bangarraju
Follow us

|

Updated on: Jan 12, 2022 | 11:32 AM

అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం బంగార్రాజు. ఇందులో అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి కీలక పాత్రలలో నటిస్తుండగా.. నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా గతంలో సూపర్ హిట్ అయిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సిక్వెల్ గా తెరకెక్కుతుంది. ముందు నుంచి చెప్పినట్టుగానే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ క్రమంలో బంగార్రాజు ట్రైలర్ నిన్న విడుదల చేసింది చిత్రయూనిట్.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక నిన్న విడుదలైన బంగార్రాజు ట్రైలర్ యూట్యూబ్‏లో ఓ రేంజ్‏లో దూసుకుపోతుంది. అతి తక్కువ సమయంలో ఈ ట్రైలర్ 7 మిలియన్ పైగా వ్యూస్ దక్కించుకుని నెంబర్ వన్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో నాగ్, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించడం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తోంది. ఇందులో నాగబాబు, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు

Also Read: Hero Siddharth: సైనాపై నేను చేసింది జోక్ మాత్రమే ఆమె గొప్ప క్రీడాకారిణి అంటూ.. బహిరంగంగా క్షమాపణ చెప్పిన హీరో సిద్ధార్ద్..

Anupama Parameswaran : ఏంటమ్మా అనుపమ ఇంతపని చేశావ్.. బరువెక్కిన గుండెతో ఫ్యాన్స్ కామెంట్స్..

Ravi Teja’s Ravanasura: రవితేజ సినిమాకోసం రంగంలో అక్కినేని యంగ్ హీరో.. న్యూ లుక్ మాములుగా లేదుగా..