Super machi Trailer: ప్రయాణం ఆపేస్తే.. గమ్యానికి విలువ ఏముంటుంది.. ఆకట్టుకుంటున్న సూపర్ మచ్చి ట్రైలర్..

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సూపర్ మచ్చి. విజేత సినిమాతో హీరోగా

Super machi Trailer: ప్రయాణం ఆపేస్తే.. గమ్యానికి విలువ ఏముంటుంది.. ఆకట్టుకుంటున్న సూపర్ మచ్చి ట్రైలర్..
Kalyan Dev
Follow us

|

Updated on: Jan 12, 2022 | 11:14 AM

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సూపర్ మచ్చి. విజేత సినిమాతో హీరోగా పరిచయమైన మెగాస్టార్ చిన్నల్లుడు.. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పులి వాసు దర్శకత్వంలో సూపర్ మచ్చి మూవీ చేస్తున్నారు. ఇందులో రచిత రామ్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సూపర్ మచ్చి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.

చూడకుండానే లవ్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇందులో ఏదో తెలియని ఫీల్ ఉంది. అనే డైలాగ్‏తో ప్రారంభమైన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. లవ్ అండ్ యాక్షన్ అంశాలు కలబోసి ఫ్యామిలీ ఎంటర్‏టైనర్ గా తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ప్రయాణం ఆపేస్తే.. గమ్యానికి విలువ ఏముంది అంటూ సాగే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో కళ్యాణ్ దేవ్ పోనీటైల్ తో స్టైలిష్ లుక్ లో కనిపించాడు. కాకపోతే అతనికి వేరే వారితో డబ్బింగ్ చెప్పించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్, రచితా రామ్, రాజేంద్రప్రసాద్, నరేష్‌తో పాటు ప్రగతి, అజ‌య్‌, పోసాని కృష్ణమురళి, ‘జబర్దస్త్’ మహేష్, భద్రం, పృథ్వీ, ఫిష్ వెంకట్ ముఖ్యపాత్రలు పోషించారు.

Also Read: Hero Siddharth: సైనాపై నేను చేసింది జోక్ మాత్రమే ఆమె గొప్ప క్రీడాకారిణి అంటూ.. బహిరంగంగా క్షమాపణ చెప్పిన హీరో సిద్ధార్ద్..

Anupama Parameswaran : ఏంటమ్మా అనుపమ ఇంతపని చేశావ్.. బరువెక్కిన గుండెతో ఫ్యాన్స్ కామెంట్స్..

Ravi Teja’s Ravanasura: రవితేజ సినిమాకోసం రంగంలో అక్కినేని యంగ్ హీరో.. న్యూ లుక్ మాములుగా లేదుగా..

Latest Articles
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. భయంతో ప్రయాణికులు
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. భయంతో ప్రయాణికులు
షాకింగ్ యాక్సిడెంట్.. రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో వైరల్
షాకింగ్ యాక్సిడెంట్.. రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో వైరల్
వీడియో చూస్తే నమ్మలేరు.. నిజంగా టీ అమ్మి కోటీశ్వరుడైన చాయ్ వాలా
వీడియో చూస్తే నమ్మలేరు.. నిజంగా టీ అమ్మి కోటీశ్వరుడైన చాయ్ వాలా
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..