The Ghost Pre Release Event LIVE: కర్నూలులో అక్కినేని హీరోలు.. కేకలతో హోరెత్తించిన అభిమానులు

కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఘోస్ట్(The Ghost).. క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకతం వహిస్తున్నారు.  హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ఘోస్ట్' సినిమాను తెరకెక్కిస్తున్నారు

The Ghost Pre Release Event LIVE: కర్నూలులో అక్కినేని హీరోలు.. కేకలతో హోరెత్తించిన అభిమానులు
Nagarjuna Akkineni , Naga C
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Sep 25, 2022 | 8:44 PM

కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఘోస్ట్(The Ghost).. క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకతం వహిస్తున్నారు.  హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం తాజా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి యూ/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా అద్భుతంగా వుందని, యాక్షన్ సన్నివేశాలు మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా పవర్ ఫుల్ గా వున్నాయని సెన్సార్ బోర్డ్ సభ్యులు చిత్ర యూనిట్ పై ప్రశంసలు జల్లు కురిపించారు. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (సెప్టెంబర్ 25) కర్నూలులోని ఎస్టీబిసి గ్రౌండ్‌లో గ్రాండ్ గా జరుగుతోంది. ఓపెన్ గ్రౌండ్ లో జరగబోతున్న ఈ పబ్లిక్ ఈవెంట్ కి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టీమ్ మొత్తం ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకని మరింత ప్రత్యేకం చేస్తూ..నాగ చైతన్య, అఖిల్ ఈ గ్రాండ్ ఈవెంట్ కి హాజరుకానున్నారు. చాలా కాలం తర్వాత స్టార్ తండ్రీ కొడుకులు కలిసి సినిమా వేడుకకి రావడం అక్కినేని అభిమానులకు కన్నుల పండుగలా ఉంది.

శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.  భరత్‌, సౌరబ్‌ ద్వయం ఈ సినిమా పాటలని స్కోర్ చేస్తున్నారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.