నేను కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కున్నా: నాగ్
అక్కనేని నాగార్జున..ఆయన వయసు రోజురోజుకు తగ్గిపోతున్నట్లు కనిపిస్తుంది. అందరూ నాగ్‌ను ఎవర్‌గ్రీన్ మన్మథుడిగా చెబుతారు.
అక్కనేని నాగార్జున..ఆయన వయసు రోజురోజుకు తగ్గిపోతున్నట్లు కనిపిస్తుంది. అందరూ నాగ్‌ను ఎవర్‌గ్రీన్ మన్మథుడిగా చెబుతారు. నాగార్జున కూడా అదే ఫిట్నెస్‌ను, గ్రేస్‌ను మెయింటెన్ చేస్తూ గ్రేట్ అనిపించుకుంటున్నారు. 60 ఏళ్లు పైబడ్డప్పటికీ..యంగ్ హీరోలకు తీసిపోని విధంగా ఆయన డ్యాన్స్ చేస్తారు. కాగా ఇన్ని సంవత్సరాల కెరీర్‌లో నాగార్జున ఎప్పుడూ అనారోగ్యంతో ఉన్నట్లు కానీ, మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు కానీ అనిపించలేదు. అయితే బయటకు చెప్పకపోయినా, ఆయన కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారట. ఒకానొక సమయంలో నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడ్డట్లు నాగ్ తెలిపారు. ఆ సమయంలో కూర్చోలేక, నిల్చోలేక బాధ పడ్డట్లు వివరించారు. ఐతే తాను ఇలా బాధ పడుతున్నట్లు ఎవరికీ చెప్పుకోలేదని నాగ్ వెల్లడించారు. ( అభిమాన హీరోకు పెళ్లి కావాలని ఫ్యాన్స్ వింత మొక్కుబడులు )
ఎన్నో సంవత్సరాలుగా విరామం లేకుండా సినిమాల్లో నటిస్తూ ఉండటం.. డ్యాన్సులు, ఫైట్లు చేయడం వల్ల ఆరేళ్ల కిందట తనకు నడుం నొప్పి, మోకాళ్ల నొప్పి వచ్చాయని నాగార్జున తెలిపారు. అలాంటి సమయంలో తనకు కొందరు మిత్రులు స్ట్రెంత్ ట్రైనింగ్ గురించి చెప్పారని.. దాని వల్ల తాను కోలుకుని మళ్లీ ఆరోగ్యవంతుడినయ్యానని వివరించారు. చాలా బాగా పని చేసిన ఆ ట్రైనింగ్ గురించి ఆ తర్వాత తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పానని నాగ్ వెల్లడించారు. శారీరకంగానే కాక మెంటల్‌గా కూడా ఆరోగ్యంగా ఉన్నపుడే మనం ఫిట్‌గా ఉన్నట్లు అని నాగ్ అభిప్రాయపడ్డారు. అందుకే తాను ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నిస్తానన్నారు. ( గుంటూరు జిల్లా : వింత వ్యాధితో కోళ్లు మృత్యువాత )