సోలో బ్రతుకే సో బెటర్ : ఓటీటీలోనే కానీ డబ్బులు కట్టి చూడాలట !
మెగా మేనల్లుడు సాయి తేజ్ ఇప్పుడు ఫుల్ పామ్ లో ఉన్నాడు. ఆయన గత రెండు సినిమాలు చిత్రలహరి, ప్రతి రోజు పండగే సినిమాలు మంచి విజయాలు అందుకున్నాడు
మెగా మేనల్లుడు సాయి తేజ్ ఇప్పుడు ఫుల్ పామ్ లో ఉన్నాడు. ఆయన గత రెండు సినిమాలు చిత్రలహరి, ప్రతి రోజు పండగే సినిమాలు మంచి విజయాలు అందుకున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా విడుదలకు రెడీగా ఉంది. త్వరలో ఈ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలుకరించబోతుంది. సాయి తేజ్, హాట్ హీరోయిన్ నభా నటేష్ జంటగా సుబ్బు అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. మంచి బజ్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను జీ5 దక్కించుకుంది. అయితే ఆ సంస్థ తమ సబ్‌స్క్రైబర్లకు ఉచితంగా ఈ సినిమాను చూసేందుకు అవకాశం ఇవ్వడం లేదు. జీప్లస్ పే పర్ వ్యూ పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కపేరణసింగం అనే తమిళ చిత్రాన్ని, ఖాలిపీలి అనే హిందీ చిత్రాన్ని ఇదే తరహాలో విడుదల చేసింది. వీటికి వరుసగా 199, 299 రేటు ఫిక్స్ చేసింది. ఇదే తరహాలో సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని కూడా పే పర్ వ్యూ పద్ధతిలో అతి త్వరలోనే రిలీజ్ చేయనున్నారట. ( ఏపీ మందుబాబులకు భారీ షాక్ ! )
అయితే సాయి తేజ్ చిత్రానికి ఎంత ధర ఫిక్స్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఓవైపు సబ్‌స్క్రిప్షన్‌కు డబ్బులు కట్టి మళ్లీ ఒక సినిమాను ఇంత డబ్బు పెట్టి వీక్షించాలంటే సినిమా ప్రేమికులకు కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందట. (గుంటూరు జిల్లా : వింత వ్యాధితో కోళ్లు మృత్యువాత )