ఏపీ మందుబాబులకు భారీ షాక్ !

ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యమైతే.. మూడు సీసాలైనా అనుమతించకూడదని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్‌శాఖ యోచిస్తోంది. ఈ మేరకు చట్టాన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

  • Ram Naramaneni
  • Publish Date - 6:12 pm, Sun, 4 October 20

ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యమైతే.. మూడు సీసాలైనా అనుమతించకూడదని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్‌శాఖ యోచిస్తోంది. ఈ మేరకు చట్టాన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఒక్కో వ్యక్తి గరిష్ఠంగా మూడు సీసాల వరకు మద్యం నిల్వ ఉంచుకునేందుకు ఎలాంటి అనుమతి అవసరం లేదని గతేడాది సెప్టెంబరులో ఏపీ ఎక్సైజ్ శాఖ  ఉత్తర్వులు విడుదల చేసింది. ( గుంటూరు జిల్లా : వింత వ్యాధితో కోళ్లు మృత్యువాత )

దీంతో కొందరు వ్యక్తులు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 3 సీసాల చొప్పున తెచ్చుకుంటున్నారు. వీరిపై స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో కేసులు నమోదుచేయగా.. వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లింది.  ప్రభుత్వమే గరిష్ఠంగా మూడు మద్యం సీసాలను ఉంచుకోవచ్చని స్పష్టం చేసిందని, అది ఏ రాష్ట్రం నుంచి తెచ్చుకున్నా నేరం కాబోదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు తరువాత, ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ తీసుకుని వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు కొందరు తక్కువ రకం మద్యాన్ని తెచ్చి ఇళ్లలో ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మూడు సీసాల నిబంధన మార్చుతూ చట్ట సవరణ చేయడంతోపాటు.. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే మద్యంపై అదనపు పన్నులను వేసి,  ధరలను సమానం చేయాలని అధికారులు ప్రతిపాదించారు.  దీనిపై జగన్ సర్కారు అతి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  ( అభిమాన హీరోకు పెళ్లి కావాలని ఫ్యాన్స్ వింత మొక్కుబడులు )