బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు చైతూ. ఆగస్ట్ 11న విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో ఆంధ్ర అబ్బాయి బాలరాజు పాత్రలో నటించి మెప్పించారు. ఈ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుతూ.. తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లతో సినిమా చేయాలనుందని చెప్పుకొచ్చారు. అలియా భట్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ అని తెలిపారు. అలాగే తన ఫస్ట్ సెలబ్రెటీ క్రష్ ఎవరనే విషయాన్ని బయటపెట్టారు.
భవిష్యత్తులో హిందీలో ఎవరితో పనిచేయాలని ఉందంటూ ఎదురైన ప్రశ్నకు చైతూ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. అలియా భట్ నటన అంటే చాలా ఇష్టం. ఆమెతో సినిమా చేయాలనే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను. అలాగే ఇంకా చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, కత్రినా కైఫ్ హీరోయిన్లతో నటించాలని ఉందని తెలిపారు. అలాగే తన ఫస్ట్ సెలబ్రెటీ క్రష్ ఎవరి అడగ్గా.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ అని చెప్పారు. గతంలో ఆమెను కలిసినప్పుడు ఆమెతో ఈ విషయాన్ని చెప్పానని అన్నారు. హాలీవుడ్ సూపర్ హిట్ ఫారెస్ట్ గంప్ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన లాల్ సింగ్ చద్దా ఆశించినంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ చిత్రంలో కరీనా కపూర్ కథానాయికగా నటించగా.. చైతూ, అమీర్ ఆర్మీ ఆఫీసర్స్ పాత్రలలో కనిపించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.