Naga Chaitanya: లాల్ సింగ్ చడ్డా షూటింగ్ లో సందడి చేసిన నాగచైతన్య తల్లి..

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఇటీవల థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విక్రమ్ కుమార్ కె దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

Naga Chaitanya: లాల్ సింగ్ చడ్డా షూటింగ్ లో సందడి చేసిన నాగచైతన్య తల్లి..
Naga Chaitanya

Updated on: Jul 31, 2022 | 10:13 AM

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య(Naga Chaitanya) ఇటీవల థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విక్రమ్ కుమార్ కె దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ యంగ్ హీరో.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చడ్డా సినిమాలో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య బాలరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాలో నాగచైతన్య కు సంబంధించిన సీన్స్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో అందరూ నాగచైతన్య నటనను అతడి హార్డ్ వర్క్ ను మెచ్చుకున్నారు. బోడి బాలరాజు పాత్ర కోసం చై ఎంత కష్టపడ్డాడో ఈ వీడియోలో చూపించారు. ఇక ఈ సినిమా షూటింగ్ లో చైతన్య అమ్మ లక్ష్మీ దగ్గుబాటి సందడి చేశారట. ఆమె షూటింగ్ సెట్ ల్లో చై నటనను చూసి సర్ ప్రైజ్ అయ్యారని తెలుస్తోంది. చైతూ హార్డ్ వర్క్ కి, నటనకు, ఇతర నటీనటులతో ఇన్వాల్వ్ అయ్యి చేయడం చూసి లక్ష్మీ మురిసిపోయారట. ఇక చిత్రయూనిట్ రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలోనూ ఆమె కనిపించారు. ఇక ఈ సినిమా పై చిత్రయూనిట్ చాలా ధీమాగా ఉన్నారు. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్, నాగార్జున , రాజమౌళి, సుకుమార్ లకు స్పెషల్ షో వేసి సినిమా చూపించారు అమీర్ ఖాన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.