Naga Chaitanya: నా పెళ్లి కూడా అలా జరగాలని కోరుకుంటున్నాను.. నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

|

Aug 29, 2024 | 6:41 PM

తాజాగా పెళ్లి దుస్తుల్లో కనిపించాడు నాగ చైతన్య. నాగ చైతన్య ఈ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ అడ్వర్టైజ్‌మెంట్ కోసమే నాగ చైతన్య ఈ లుక్ లో కనిపించాడని తెలుస్తోంది. అలాగే తన పెళ్లి గురించి మాట్లాడాడు. పెళ్లి తేదీని త్వరలో తెలియజేస్తానని నాగ చైతన్య అన్నారు.

Naga Chaitanya: నా పెళ్లి కూడా అలా జరగాలని కోరుకుంటున్నాను.. నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Naga Chaitanya, Shobitha
Follow us on

అక్కినేని నాగ్ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి.  ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి నాగ చైతన్య సోషల్ మీడియాలో చాలా వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా పెళ్లి దుస్తుల్లో కనిపించాడు నాగ చైతన్య. నాగ చైతన్య ఈ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ అడ్వర్టైజ్‌మెంట్ కోసమే నాగ చైతన్య ఈ లుక్ లో కనిపించాడని తెలుస్తోంది. అలాగే తన పెళ్లి గురించి మాట్లాడాడు. పెళ్లి తేదీని త్వరలో తెలియజేస్తానని నాగ చైతన్య అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : పెళ్లైన ముగ్గురితో ఎఫైర్స్.. వారిలో క్రికెటర్ కూడా.. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే

పెళ్లి కొడుకు గెటప్‌లో నాగ చైతన్య మీడియా ముందుకు వచ్చాడు. వివాహాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు అనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘పెళ్లి అనేది ఎప్పుడూ గ్రాండ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. పెళ్లి అంటే ప్రజలు సంస్కృతులు, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుంటారు. నా పెళ్లి కూడా అలా జరగాలని కోరుకుంటున్నాను’ అన్నారు నాగ చైతన్య.

ఇది కూడా చదవండి :Tollywood : దుమ్మురేపిన దృశ్యం పాప..! అందాలతో గత్తర లేపిందిగా..

ఆగస్ట్ 8న నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. నాగ చైతన్య, శోభిత పెళ్లి తేదీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. నిశ్చితార్ధం తర్వాత నాగ చైతన్య, శోభిత ఫోటోలను అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. నాగ చైతన్యకి ఇది రెండో పెళ్లి. గతంలో సమంతకు నాగ చైతన్యతో పెళ్లయింది. వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఈ జంట 2021లో విడిపోయారు. నాగ చైతన్య, శోభిత వివాహం రాజస్థాన్‌లో జరుగుతుందని టాక్ వినిపిస్తుంది. నాగార్జున డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటాడని అంటున్నారు. రాజస్థాన్‌లో పెళ్లి చేసుకోవాలని నాగ చైతన్య అనుకుంటున్నారట. గతంలో నాగ చైతన్య, సమంతల పెళ్లి గోవాలో జరిగిన విషయం తెలిసిందే.. ఇప్పుడు నాగ చైతన్య తండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.