Thandel Glimpse: ‘తండేల్’ గ్లింప్స్ రిలీజ్.. ఇక రాజులమ్మ జాతరే..

ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ పెయిర్ జోడి కట్టడంతో ఇప్పుడు ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన చైతూ పస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన సాయి పల్లవి లుక్ ఆసక్తిని కలిగించింది. కొద్ది నెలలుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా శనివారం ఉదయం ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

Thandel Glimpse: 'తండేల్' గ్లింప్స్ రిలీజ్.. ఇక రాజులమ్మ జాతరే..
Thandel
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 06, 2024 | 12:25 PM

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ చందూ మోండేటి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘తండేల్’. ఇందులో మరోసారి చైతూ సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. గతంలో వీరిద్దరి కలిసి నటించిన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ పెయిర్ జోడి కట్టడంతో ఇప్పుడు ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన చైతూ పస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన సాయి పల్లవి లుక్ ఆసక్తిని కలిగించింది. కొద్ది నెలలుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా శనివారం ఉదయం ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఎసెన్స్ ఆఫ్ తండేల్ (Essence of Thandel) అంటూ విడుదల చేసిన ఈ గ్లింప్స్ మొత్తం 2 నిమిషాల నిడివితో ఉంది. బతుకుదెరువు కోసం గుజరాత్ లోని వీరవల్ కు వెళ్లిన నాగ చైతన్య సముద్రవేట చేస్తూ పాకిస్తాన్ కోస్టుగార్డులకు చిక్కుతాడు. అతడితోపాటు వెళ్లిన వారందరిని అరెస్ట్ చేసి జైలులో పెట్టేస్తారు పాకిస్తాన్ పోలీసులు. ఆ తర్వాత జైలు నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనేది తండేల్ స్టోరీ. దేశభక్తి.. అందమైన ప్రేమకథను జత చేసి కమర్షియల్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు.

గ్లింప్స్ చివరలో.. “బుజ్జితల్లి వచ్చేస్తున్న కదే.. కాస్తా నవ్వవే” అంటూ చైతూ వాయిస్ వస్తుండగా.. సాయి పల్లవి కనిపించడం వీడియో మొత్తానికి హైలెట్ అయ్యింది. దీంతో తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే చైతూ, సాయి పల్లవి ఖాతాల్లో మరో సూపర్ హిట్ పడడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఇందులో చైతూ పక్కా ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ మూవీ కోసం తన ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చైతూ. గడ్డం.. పొడవాటి జుట్టుతో ఇంతకు ముందు కనిపించిన రగ్గడ్ లుక్ లో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.