Naga Babu Konidela: వర్మకు మద్దతుగా రంగంలోకి మెగా బ్రదర్.. సోషల్ మీడియా వేదికగా ఏమన్నారంటే..

ప్రభుత్వానికి టాలీవుడ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. టికెట్ ధరల విషయంలో సినిమా పెద్దలు ప్రభుత్వం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Naga Babu Konidela: వర్మకు మద్దతుగా రంగంలోకి మెగా బ్రదర్.. సోషల్ మీడియా వేదికగా ఏమన్నారంటే..
Rgv
Follow us

|

Updated on: Jan 04, 2022 | 6:47 PM

Naga Babu Konidela: ప్రభుత్వానికి టాలీవుడ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. టికెట్ ధరల విషయంలో సినిమా పెద్దలు ప్రభుత్వం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక టికెట్ ధరలు పెంచాలంటూ నిర్మాతలు అంటుంటే.. ప్రజలకు అందుబాటులో ఉండేందుకే ధరలను తగ్గించామని ప్రభుత్వం చెప్తుంది. సామాన్యులకు టికెట్ ధరలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం ఈ జీవోను తీసుకువచ్చిందని ఏపీ మంత్రులు చెప్తున్నా మాట. పేదలకు వినోదం అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏపీ మంత్రులు మైకులు పెట్టి మొత్తుకుంటున్నారు. అయితే సినిమా టికెట్ ధరను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇక ఈ వ్యవహారం పై ఇప్పటికే సినీ పెద్దలకు ఏపీ మంత్రులకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ విషయం పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. ఇప్పటికే టీవీ 9వేదికగా ఏపీ మంత్రి పేర్ని నానితో మాటల యుద్దానికి దిగిన ఆర్జీవీ. ఇప్పుడు తనకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో తనకు ఉన్న పది ప్రశ్నలను ప్రభుత్వం పై సంధించారు ఆర్జీవీ.

అయితే ఆర్జీవీ అడిగిన 10 ప్రశ్నల పై రియాక్ట్ అయ్యారు మెగా బ్రదర్ నాగబాబు. సోషల్ మీడియా వేదికగా నాగబాబు స్పందిస్తూ.. మీరు అడిగిన ప్రశ్నలన్నీ సత్యాలే.. నేను అడగలనుకున్న పది ప్రశ్నలు మీనోటి ద్వారా బయటకు వచ్చాయి.. అని ట్వీట్ చేశారు నాగబాబు. మరి ఇప్పుడు నాగబాబు ట్వీట్ పై ఏపీ మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి.

 మరిన్ని ఇక్కడ చదవండి : 

Liger Glimpse-Vijay Devarakonda: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న లైగర్ గ్లింప్స్.. రికార్డ్స్ కొల్లగొడుతున్న రౌడీ విజయ్..

Bigg Boss Telugu OTT: తెలుగు బిగ్ బాస్ ఓటీటీ లాంచ్ డేట్ అప్పుడేనా.. కంటెస్టెంట్లు వీరేనా.!

Viral Photo: పిస్టోల్ చేతపట్టి స్టైల్‏గా ఫోటోకు ఫోజిచ్చిన ఈ చిన్నది.. ఇటు సౌత్, అటు నార్త్‏లో దూసుకుపోతుంది..

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు