Adipurush: ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని వెయిట్‌ చేస్తున్నా.. నాగబాబు కామెంట్స్‌ వైరల్‌

|

Jun 18, 2023 | 8:14 AM

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ నటించిన 'ఆదిపురుష్‌' గ్రాండ్‌గా రిలీజైంది. శుక్రవారం (జూన్‌ 16) విడుదలైన ఈ మైథలాజికల్‌ సినిమాకు నెగెటివ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్లు మాత్రం భారీగానే వస్తున్నాయి. మొదటి రోజు ఏకంగా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డుల వేట మొదలెట్టింది. ఇక ఆదిపురుష్‌ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తుంది

Adipurush: ప్రభాస్‌ ఆదిపురుష్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని వెయిట్‌ చేస్తున్నా..  నాగబాబు కామెంట్స్‌ వైరల్‌
Naga Babu
Follow us on

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌’ గ్రాండ్‌గా రిలీజైంది. శుక్రవారం (జూన్‌ 16) విడుదలైన ఈ మైథలాజికల్‌ సినిమాకు నెగెటివ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్లు మాత్రం భారీగానే వస్తున్నాయి. మొదటి రోజు ఏకంగా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డుల వేట మొదలెట్టింది. ఇక ఆదిపురుష్‌ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ రామాయణ మహాకావ్యాన్ని అందరూ చూడాలంటూ సెలబ్రిటీలు పిలుపునిస్తున్నారు. తాజాగా మెగా బ్రదర్‌ నాగబాబు ఆదిపురుష్‌ సినిమాపై స్పందించారు. అందరూ ఈ ఇతిహాస గాథను చూడాలంటూ కోరారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ వీడియోను రిలీజ్‌ చేశారు నాగబాబు. ‘ ఆదిపురుష్‌ ట్రైలర్‌ చూశాను.. కానీ ఇంకా సినిమాను చూడలేదు. అయితే తప్పకుండా సినిమా చూస్తాను. ఒక నిజమైన మనిషి ఎలా ఉండాలన్నది మొదట నిరూపించిన వ్యక్తి శ్రీరాముడు. రామాయణం, మహాభారతం వంటి అద్భుత గ్రంథాలు ప్రపంచంలో మరెక్కడా లలేవని అభిప్రాయం. ఒక మనిషి ఎలా ఉండాలి? ఎంత నిబద్ధతతో బతకాలి అన్న విషయాలను శ్రీరాముడు నిరూపిస్తే, ఒక మనిషికి ఎలాంటి తెలివి తేటలుండాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది శ్రీకృష్ణుడు చాటి చెప్పాడు. న్యాయం, ధర్మం లాంటి సూత్రాలను అతిక్రమించకుండా ఎలా జీవించాలో చెప్పిన అద్భుతమైన క్యారెక్టర్లు శ్రీరాముడు, కృష్ణుడు. చాలామందికి రామాయణం, మహాభారతం గ్రంథాలపై పెద్దగా అవగాహన ఉండదు. అయితే నేను ఈ ఇతిహాస గ్రంథాలను పూర్తిగా చదివాను’ అని నాగబాబు చెప్పుకొచ్చారు.

 

ఇవి కూడా చదవండి

‘రామాయణం ఈరోజు ఆదిపురుష్‌ అనే పేరుతో రిలీజైంది. ఇందులో హీరో ప్రభాస్‌ అంటేనో, ఇంకొకళ్లనో నేను ఈ మాటలు చెప్పడం లేదు. ఒక అద్భుతమైన రామాయణ గాథను తెరకెక్కించి ఈరోజు మనందరికీ చూపిస్తున్నారు. రామాయణం జరిగిందని నమ్మకం ఉంది. కాబట్టి ఆదిపురుష్‌ రూపంలో వచ్చిన రామాయణం కచ్చితంగా చూడండి. ఎంత అద్భుతంగా ఈ మూవీని తెరకెక్కించారు. ట్రైలర్‌ చూసిన నాకు ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా? అని అనిపిస్తోంది’ అని నాగబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈవీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..