Natural Star Nani : నేచురల్ స్టార్ మరోసారి ఓటీటీనే నమ్ముకుంటాడా.. ‘టక్ జగదీష్’ పరిస్థితేంటి..?

పాపం.. న్యాచురల్ స్టార్ నాని.. "టక్ జగదీష్" సినిమాతో ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని అనుకున్నారు కాని.. పగపట్టినట్టు మరో సారి మన న్యాచురల్ నాని..

Natural Star Nani : నేచురల్ స్టార్ మరోసారి ఓటీటీనే నమ్ముకుంటాడా.. టక్ జగదీష్ పరిస్థితేంటి..?
Nani

Updated on: May 16, 2021 | 8:30 PM

Natural Star Nani :

పాపం.. న్యాచురల్ స్టార్ నాని.. “టక్ జగదీష్” సినిమాతో ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని అనుకున్నారు కాని.. పగపట్టినట్టు మరో సారి మన న్యాచురల్ నాని సినిమాకు అడ్డు తగిలింది కరోనా . తన సిల్వర్ జూబ్లీ మూవీ “వి”ని కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా ottకి ఇచ్చేసిన నానీ.. ఇప్పుడు టక్ జగదీష్ కు కూడా అదే పరిస్థితి పడుతుందా ఏంటి అని ఆలోచిస్తూ తెగ హైరానా పడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రస్తుతం ‘టక్ జగదీష్’ కు డబ్బింగ్ చెప్పే పనిలో ఉన్నాడు నాని.

టక్‌ జగదీష్‌ సినిమాలో ఐశ్వర్యా రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను  సాహూ గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. శివ నిర్వాణ డైరెక్షన్లో టక్ జగదీష్ ని యమా సీరియస్ గా కంప్లీట్ చేసిన నాని.. చకా చకా రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. అందులో భాగంగానే రిలీజ్‌ డేట్ను ప్రకటించేసి మరీ గ్రాండ్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ చేసేశారు.కాని ఈ లోపే నాని అనుకున్నదంతా అయ్యింది. కరోనా మరో సారి సెకండ్ వేవ్‌గా వచ్చి ఈ చిన్నోని సినిమాకు అడ్డుతగిలింది. దీంతో అటు ఓటీటీకి పోలేక.. ఇటు థియేటర్లు ఎప్పుడు ఒపెన్ అవుతాయో తెలియక నాని.. సైలెంట్ అయిపోయారు. ఈ సినిమాతర్వాత టాక్సీవాలా సినిమాను తెరకెక్కించిన రాహుల్ సాంకృత్యాన్ తో శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు నాని ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Akhanda Movie : కరోనా కారణంగా ఆలస్యం అవుతున్న ‘అఖండ’… బాలయ్య సినిమాకోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు..

Mahesh Babu-Trivikram: సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున మహేష్ – త్రివిక్రమ్ సినిమా మోషన్ పోస్టర్ రానుందా.?

F3 movie : త్రిబుల్ ఫన్ తో రానున్న అనిల్ రావిపూడి.. ఈసారి సందడంతా ఆ హీరోదేనంట..

Loading...
Unable to load recommendations.
Follow Us