Leo Movie: లియో నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్.. ఆకట్టుకుంటున్న వీడియో..

దీంతో కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో లియో సినిమాపై ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అంచనాలను పెంచేశాయి. మంగళవారం సాయంత్రం ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు మేకర్స్

Leo Movie: లియో నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్.. ఆకట్టుకుంటున్న వీడియో..
Leo

Updated on: Jun 20, 2023 | 9:17 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం లియో. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇందులో విజయ్ సరసన త్రిష కథానాయికగా నటిస్తుంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా ఇది. దీంతో కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో లియో సినిమాపై ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అంచనాలను పెంచేశాయి. మంగళవారం సాయంత్రం ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు మేకర్స్

మంగళవారం సాయంత్రం లియో ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో కలిసి విజయ్ సొంతంగా ఆలపించడం విశేషం. మంచి మాస్ బీట్ తో సాగిన ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటుంది. కాగా పాట పూర్తి వీడియోను దళపతి పుట్టిన రోజు సందర్భంగా జూన్ 22న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ మూవీని పూర్తి చేసుకుని అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇటీవలే వారసుడు సినిమాతో హిట్ అందుకున్నారు విజయ్. తెలుగులో దళపతి నటించిన మొదటి చిత్రం ఇది. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. మరోవైపు ఇప్పటికే విజయ్ బర్త్ డే సెలబ్రెషన్స్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి