Bangarraju Movie : బంగార్రాజు నుంచి అందమైన మెలోడీ.. మరోసారి తన గాత్రంతో ఆకట్టుకున్న సిద్ శ్రీరామ్..
కింగ్ నాగార్జున కెరీర్ లో మంచి విజయాన్ని సాధించిన సినిమాల్లో సోగ్గాడే చిన్నినాయనా ఒకటి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
Bangarraju Movie : కింగ్ నాగార్జున కెరీర్ లో మంచి విజయాన్ని సాధించిన సినిమాల్లో సోగ్గాడే చిన్నినాయనా ఒకటి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కుతుంది. బంగార్రాజు అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాను కూడా కళ్యాణ్ కృష్ణనే డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాగ్ తోపాటు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కూడా నటిస్తున్నారు. ఈ సినిమా నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా… చైతన్య సరసన లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి కనిపించనుంది. ఇక బంగార్రాజు సినిమాలో నాగలక్ష్మి అనే పాత్రలో కనిపించనుంది కృతి శెట్టి. నాగలక్ష్మి లుక్ ను ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమానుంచి ఓ అందమైన మెలోడీని విడుదల చేశారు చిత్రయూనిట్. నా కోసం నువ్వు ..అంటూ సాగే ఈ పాటకు బాలాజీ సాహిత్యం అందించగా.. సిద్ శ్రీరామ్ ఆలపించారు. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ లిరికల్ వీడియో చివరిలో నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి కనిపించరు. ఈ సినిమాను జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమా పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :