Mythri Movie Makers : ఇలా చేస్తే సినిమాపై ఉండే ఎగ్జ‌యిట్‌మెంట్ పోతుంది.. ఆవేదన వ్యక్తం చేసిన మైత్రి మూవీ మేకర్స్ అధినేత

|

Aug 16, 2021 | 10:04 PM

టాలీవుడ్‌‌‌‌లో లీకుల బెడద వదలడం లేదు. సినిమాలు సెట్స్ పైన ఉండగానే ఫోటోలు వీడియోల రూపంలో లీక్ లు బయటకు వస్తున్నాయి. ఇక పెద్ద సినిమాలకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.

Mythri Movie Makers : ఇలా చేస్తే సినిమాపై ఉండే ఎగ్జ‌యిట్‌మెంట్ పోతుంది.. ఆవేదన వ్యక్తం చేసిన మైత్రి మూవీ మేకర్స్ అధినేత
Pushpa
Follow us on

Mythri Movie Makers : టాలీవుడ్‌‌‌‌లో లీకుల బెడద వదలడం లేదు. సినిమాలు సెట్స్ పైన ఉండగానే ఫోటోలు వీడియోల రూపంలో లీక్ లు బయటకు వస్తున్నాయి. ఇక పెద్ద సినిమాలకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. సినిమా టీజర్, ఫస్ట్ లుక్ వంటివి రిలీజ్ చేదాం అనుకునేలోగానే నెట్టింట ప్రత్యక్షం అవుతున్నాయి. ఇటీవల పెద్ద సినిమాలైన పుష్ప, సర్కారు వారి పాట సినిమాకు కూడా లీకుల సెగ తగిలింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారిపాట టీజర్‌‌‌ను మహేష్ బర్త్ డే కానుకగా ఉదయం 9 గంటల సమయంలో విడుదల చేయాలని భావించారు. కానీ ముందే లీక్ అవడంతో అప్పటికప్పుడు అర్ధరాత్రి టీజర్‌‌‌ను వదిలేశారు. దాంతో మహేష్ అభిమానులు కాస్త నిరాశ పడ్డారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా సాంగ్ కుండా రిలీజ్‌‌‌కు ముందే నెట్టింట చక్కర్లు కొట్టింది. దాంతో మైత్రీ మూవీ మేక‌ర్స్  ఈ విషయాన్నీ సీరియస్‌‌‌గా తీసుకొని సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ మాట్లాడుతూ.. ‘‘ రీసెంట్‌గా మేం చేస్తున్న సినిమాలు స‌ర్కారువారిపాట‌, పుష్పకు సంబంధించిన కంటెంట్‌ బ‌య‌ట‌కు రావ‌డం మ‌మ్మ‌ల్ని ఎంతో ఇబ్బంది పెట్టింది. ఇటువంటి ప‌నుల వ‌ల్ల ప్రేక్ష‌కుల్లో సినిమాపై ఉండే ఎగ్జ‌యిట్‌మెంట్ పోతుంది. కాబ‌ట్టి  ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుని సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాం. త‌ప్పు చేసిన వారిని ప‌ట్టుకుని శిక్ష‌ప‌డేలా చ‌ర్య‌లు తీసుకుంటాం అని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. అలాగే  సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ బాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. మైత్రి మూవీస్ నిర్మాత ఫిర్యాదు మేరకు 66A ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసాం, వంద అకౌంట్ల ద్వార పైరసీ వీడియోను వైరల్ చేసినట్టు కంప్లైంట్ చేశారు. టీజర్, ఫస్ట్ లుక్, కంటెంట్ మిస్సింగ్ పై దర్యాప్తు చేస్తున్నాం, ఎడిటింగ్ రూమ్‌‌‌‌లోని టెక్నీషియన్ పాత్ర పై అనుమానాలు ఉన్నాయని అన్నారు. అలాగే ఐపీ నంబర్, సీసీ ఫుటేజ్, కాల్ డేటాను పరిశీలిస్తున్నాం, ఇంటి దొంగల పాత్రపై దర్యాప్తు చేపడుతున్నాం, త్వరలోనే కేసు చేదిస్తాం అని తెలిపారు.


మరిన్ని ఇక్కడ చదవండి : 

Mythri Movie Makers: స్టార్ హీరోల సినిమాలకు తప్పని లీకుల బెడద.. పోలీసులను ఆశ్రయించిన మైత్రీ మూవీ మేకర్స్.

Ileana D’Cruz: రీఎంట్రీ ఇవ్వనున్న ఇలియానా.. రవితేజతో కలిసి స్టెప్పులేయనున్న గోవా బ్యూటీ..

Aadi Sai kumar: కొత్త సినిమాను ప్రారంభించిన ఆది సాయి కుమార్.. టైటిల్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..