దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బీస్ట్(Beast ). నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం దళపతి ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తునారు. మాస్టర్ సినిమా తో విజయ్ బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అలాగే బీస్ట్ నుంచి వచ్చిన రెండు పాటలు కూడా భారీ వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. బీస్ట్ సినిమా ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది.. ఈ తరుణంలో సినిమాకు అనుకోని అడ్డంకులు ఎదురవుతున్నాయి. తాజాగా తమిళనాడులో బీస్ట్ సినిమా దుమారం రేపుతోంది. ఈ మూవీపై ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సినిమా రిలీజ్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే అరబ్ దేశాల్లో బీస్ట్ సినిమాపై నిషేధం విధించాయి అక్కడి ప్రభుత్వాలు.
బీస్ట్ సినిమా ట్రైలర్ లో.. చెన్నైలోని ఓ మాల్ ని టెర్రరిస్ట్ లు హైజాక్ చేయగా.. ఆ తీవ్రవాదుల బారి నుంచి ప్రజలను రక్షించి తీసుకుని రావడానికి సోల్జర్ వీర రాఘవన్ గా దళపతి రంగంలోకి దిగుతాడు. ఆ నేపథ్యంలో చోటుచేసుకునే యాక్షన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. దాంతో ఈ సినిమా ఎలా ఉండబోతుంది. ఈ సినిమాలోని కథ ఏంటి అన్నది అర్ధమవుతుంది. ఈ సినిమాలో ఇస్లామిక్ టెర్రరిజాన్ని చూపించనున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీస్ట్ సినిమాపై రచ్చ జరుగుతోంది. అయితే తమిళనాడులో బీస్ట్, కేజీఎఫ్ 2 మధ్య వివాదం నడుస్తోంది. బీస్ట్ సినిమా రిలీజ్‌ను అడ్డుకోవడంపై విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీస్ట్ మూవీ వివాదం, కేజీఎఫ్ 2 విడుదలపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. అసభ్యకరంగా మీమ్స్, పోస్టులు పెడుతున్నారు. దీంతో హీరో విజయ్ సీరియస్ అయ్యారు. హద్దు మీరొద్దంటూ అభిమానులను హెచ్చరించారు. నేతలు, సినిమా ప్రముఖులు, మత సంబంధ సంఘాలపై ట్రోల్స్ చేస్తే ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు విజయ్.
మరిన్ని ఇక్కడ చదవండి :