ఇక సెలవ్‌.. సంగీత దిగ్గజం రాజ్‌ అంత్యక్రియలు పూర్తి.. మిత్రుడిని కడసారి చూసి కోటి కన్నీటిపర్యంతం

సోమవారం ఉదయం రాజ్‌ అంతిమ యాత్ర ప్రారంభమైంది. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు నుంచి మహాప్రస్థానం వరకు ఈ అంతిమయాత్ర కొనసాగింది. మహా ప్రస్థానంలో కోటి ,శివాజిరాజా , కాశీ విశ్వనాథ్ , జయంత్ , నల్లమల్లపు బుజ్జి తదితరులు రాజ్ మృతదేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు.

ఇక సెలవ్‌.. సంగీత దిగ్గజం రాజ్‌ అంత్యక్రియలు పూర్తి.. మిత్రుడిని కడసారి చూసి కోటి కన్నీటిపర్యంతం
Music Director Raj
Follow us

|

Updated on: May 22, 2023 | 1:32 PM

తెలుగు సినీ ప్రేక్షకులకు మరుపురాని పాటలను అందించిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ రాజ్‌ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని తన నివాసంలో కన్నుమూశారాయన. రాజ్‌ మరణంపై తెలుగు చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంగీత దిగ్గజానికి నివాళులు అర్పించారు. కాగా సోమవారం ఉదయం రాజ్‌ అంతిమ యాత్ర ప్రారంభమైంది. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు నుంచి మహాప్రస్థానం వరకు ఈ అంతిమయాత్ర కొనసాగింది. మహా ప్రస్థానంలో కోటి ,శివాజిరాజా , కాశీ విశ్వనాథ్ , జయంత్ , నల్లమల్లపు బుజ్జి తదితరులు రాజ్ మృతదేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. కాసేపటి క్రితమే మహాప్రస్థానంలో రాజ్‌ అంత్యక్రియలు ముగిశాయి. రాజ్‌ పెద్దల్లుడు కృష్ణంరాజు ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా రాజ్‌తో సుమారు 180కు సినిమాలకు పనిచేసిన కోటి  తన మిత్రుడి భౌతికకాయాన్ని చూసి తట్టుకోలేకపోయారు. చివరిచూపు చూసుకొని కన్నీరుపెట్టుకున్నారు.

కాగా రాజ్‌ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అలనాటి సంగీత దర్శకుడు టీవీరాజు కుమారుడే రాజ్‌. .ప్రళయగర్జన సినిమాతో సినీ సంగీత ప్రస్థానం ప్రారంభించిన రాజ్‌.. మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌ కోటితో కలిసి.. ఎన్నో మరుపురాని పాటలు అందించారు. ప్రధానంగా 90వ దశకంలో తమ సంగీతంతో ఒక ఊపు ఊపేశారు రాజ్‌ కోటి.వీళ్లిద్దరూ కలిసి 180కి పైగా సినిమాలకు సంగీతం అందించారు.అయితే.. అనుకోని పరిస్థితుల్లో కోటి నుంచి విడిపోయిన రాజ్‌.. సొంతంగా పది సినిమాలకు సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం