Devi Sri Prasad : అనిల్‌లో గొప్ప నటుడు వున్నారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన దేవి శ్రీ

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎఫ్3. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు

Devi Sri Prasad : అనిల్‌లో గొప్ప నటుడు వున్నారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన దేవి శ్రీ
F3
Follow us
Rajeev Rayala

|

Updated on: May 21, 2022 | 9:06 AM

విక్టరీ వెంకటేష్(Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(varun tej), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎఫ్3. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తుంది. ‘ఎఫ్3 ‘ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఎఫ్3 సెన్సార్ పూర్తయింది.సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ సభ్యులు సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే వున్నారు. ఎఫ్ 2తర్వాత ఇంత హాయిగా నవ్వుకున్న సినిమా ఎఫ్ 3అనే అని సెన్సార్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్న నేపధ్యంలో చిత్ర సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మీడియాతో ఎఫ్ 3 విశేషాలు పంచుకున్నారు.

దేవీశ్రీ మాట్లాడుతూ.. దర్శకుడు అనిల్ రావిపూడి గారితో పని చేస్తే ఒత్తిడి వుండదు. ఆయన స్క్రిప్ట్ చెప్పినపుడే సినిమా చూసినట్లు వుంటుంది అన్నారు. వెంకటేష్ గారి పాత్ర గురించి చెప్పినపుడు ఆయనలానే యాక్ట్ చేశారు. వరుణ్ తేజ్ పాత్ర చెప్పినపుడు వరుణ్ లా చేస్తారు.. చివరికి హీరోయిన్ పాత్రలు కూడా నటించేస్తారు, నిజానికి అనిల్ లో గొప్ప నటుడు వున్నారు. ఆయన అంత చక్కగా నటించి చెప్పడం వలన సినిమా టైమింగ్ తెలిసిపోతుంది. అలాగే ఆయన చాలా ఫాస్ట్ గా సినిమా తీస్తారు. ఎఫ్ 2 విషయానికి వస్తే ఎక్కువ సిట్యుయేషనల్ సాంగ్స్. ఎఫ్ 3లో సిట్యుయేషనల్ గానే కాకుండా జనరల్ గా కనెక్ట్ అయ్యే సాంగ్స్ చేశాం. లబ్ డబ్ డబ్బు, లైఫ్ అంటే ఇట్లా వుండాలా పాటలు కథలో భాగం అవుతూనే అందరికీ కనెక్ట్ అయ్యేలా వుంటాయి. ఈ సినిమాలోని పాటల గురించి మాట్లాడుతూ.. లబ్ డబ్ డబ్బు కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఉ ఆహా.. లైఫ్ అంటే ఇట్లా వుండాలా.. పాటలు కూడా డిఫరెంట్ గా ఉంటూ చాలా కొత్తగా వున్నాయని ఆడియన్స్ ఫీలయ్యారు. అన్నిటికంటే దర్శకుడు అనిల్ రావిపూడి గారు సినిమా రీరికార్డింగ్ అంతా చూసి.. అద్భుతంగా చేశారు. మీకు వంద హగ్గులు వంద ముద్దులు” అన్నారు. దర్శకుడు ఆ మాట చెప్పడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అన్నారు దేవి శ్రీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

kangana Raunaut: ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేసిన కంగనా రనౌత్.. దాని ధర ఎంతంటే..?

NTR Movie: 20ఏళ్ల కల నెరవేరిందంటున్న కేజీఎఫ్‌ డైరెక్టర్‌..ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..ట్విట్స్‌ వైరల్‌

JR. NTR Fans Hungama: అర్ధరాత్రి ఎన్టీఆర్‌ ఇంటి వద్ద అసలేం జరిగింది..? పోలీసు లాఠీ ఛార్జ్‌ ముందు పరిస్థితి ఎంటీ..? వీడియోలు వైరల్‌

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!