Tollywood: లోకల్ ట్రైన్‏లో హీరోయిన్‏తో అసభ్య ప్రవర్తన.. పోలీసుల ఏమన్నారంటే..

ఇప్పుడిప్పుడే సౌత్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్. మలయాళం, తమిళంలో పలు చిత్రాల్లో నటించిన అమ్మడు.. ప్రస్తుతం తెలుగులో మొదటి సినిమా చేస్తుంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Tollywood: లోకల్ ట్రైన్‏లో హీరోయిన్‏తో అసభ్య ప్రవర్తన.. పోలీసుల ఏమన్నారంటే..
Malavika Mohanan

Updated on: Jun 15, 2025 | 5:22 PM

ప్రస్తుతం దక్షిణాది సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు తెలుగులో తొలి సినిమా చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తనకు ముంబై లోకల్ ట్రైన్ లో ఎదురైన ఓ చేదు సంఘటనను పంచుకుంది. ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న సమయంలో తనతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని.. తన స్నేహితులతో కలిసి రాత్రి సమయంలో ఓ లోకల్ ట్రైన్ లో వెళ్తుండగా.. కంపార్ట్మెంట్ వద్ద ఉన్న గ్లాస్ డోర్ నుంచి ఓ వ్యక్తి తమ వైపు చూస్తూ ముద్దిస్తావా అని సైగలు చేశాడని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తాను ఎంతో భయాందోళనకు గురయ్యానని.. ముంబైలాంటి నగరంలో మహిళల భద్రత లేదని చెప్పుకొచ్చింది. తాజాగా ఈ హీరోయిన్ కామెంట్స్ పై ముంబై పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? తనే రాజాసాబ్ బ్యూటీ మాళవిక మోహనన్.

ప్రస్తుతం రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్న మాళవిక మోహనన్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ పై ముంబై పోలీసులు స్పందించారు. “మాళవిక గారు మేము మీ చెప్పిన విషయాలు చూశారు. మీకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు. నగరలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనల అనుభవాలు చాలా కాలం వరకు ప్రభావాన్ని చూపిస్తుంటాయి. నగంరోల రోజులో ఏ సమయంలోనైనా .. లేదా ఎక్కడైనా ప్రయత్నిస్తుంటే దయచేసి 112, 100 నంబర్స్ కు కాల్ చేయండి. మేము వీలైనంత త్వరగా మీకు అండగా నిలుస్తాము ” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ముంబై పోలీసుల ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఇదిలా ఉంటే.. మాళవిక మోహనన్.. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పెట్ట సినిమాతో ఎక్కువగా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ డ్రామా రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీతోనే మాళవిక తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. త్వరలోనే ఈ మూవీ టీజర్ రిలీజ్ కానుంది.

ముంబై పోలీసుల ట్వీట్.. 

ఇవి కూడా చదవండి :  

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..

Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..

Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..