ఇండియన్ స్క్రీన్ మీద ఈ మధ్యనే మల్టీవర్స్ ట్రెండ్ మొదలయింది. కానీ ఈ ఫార్ములాను వెండితెర మీద ఎప్పటి నుంచో అప్లై చేస్తోంది హాలీవుడ్ సినిమా. రెండు డిఫరెంట్ సినిమాల్లో సూపర్ హిట్ అయిన క్యారెక్టర్స్‌ను ఒకే స్క్రీన్‌లో చూపించి మరింతగా సక్సెస్ అవుతున్నారు వెస్టన్ మేకర్స్. ముఖ్యంగా సూపర్ హీరోస్ క్యారెక్టర్స్‌తో ఈ తరహా సినిమాలను ఎక్కువగా చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలను ఇష్టపడుతున్నారు. అయితే మనదగ్గర మల్టీవర్స్ ట్రెండ్ విషయానికొస్తే.. లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాను మర్చిపోగలమా..? విక్రమ్ సినిమాతో చాలా కాలం తరువాత బిగ్ హిట్ అందుకున్నారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. ఆ సినిమా సక్సెస్ కమల్‌కు పూర్వ వైభవం తీసుకురావటమే కాదు. అప్ కమింగ్ సినిమాల విషయంలోనూ హైప్ పెంచింది. ఒక్క విక్రమ్ సక్సెస్ తరువాత ఏకంగా నాలుగు సీక్వెల్స్‌కు సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
సౌత్‌లో ఇప్పటిదాకా గ్యాంగ్‌స్టర్ల సినిమాల్లో మల్టీవర్స్ కాన్సెప్ట్ లను చూశాం. వెరీ నియర్ ఫ్యూచర్‌లో చీకటి సామ్రాజ్యానికి సంబంధించిన కథల్లోనూ మల్టీవర్స్ ని చూస్తాం. కానీ నార్త్ లో పరిస్థితి వేరుగా ఉంది. అక్కడ పోలీసులకు పోలీసులు, స్పైలకు స్పైలు హెల్ప్ చేసుకుంటున్నారు. నార్త్ లో మల్టీవర్స్ తో ముందుకు రాబోతున్నది అలాంటి కేరక్టర్లే మరి.
డైరక్టర్‌కి ఇలాంటి ఆలోచనలు బోలెడన్ని రావచ్చు. కానీ కన్విన్స్ అయ్యి, కొత్తదనాన్ని ఆహ్వానించాలనే ఉద్దేశంతో హీరోలు ముందుకు రావాలి. అప్పుడే కంటెంట్‌లో ఫ్రెష్‌నెస్ కనిపిస్తుంది. హాలీవుడ్ స్థాయిలో అందరినీ మెస్మరైజ్ చేస్తున్న మల్టీవర్స్ కి మన దగ్గరా మస్తు ఆదరణ దక్కుతుంది. మరి ఇలాంటి సినిమాలు ఇంకెన్నొస్తాయో చూడాలి.
TV9 (ET Desk)
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.