National Cinema Day: రేపే సినిమా పండగ.. రూ.99 లకే మల్టీప్లెక్స్‌ మూవీ టికెట్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?

|

Oct 12, 2023 | 1:32 PM

జాతీయ సినిమా దినోత్సవం వచ్చేసింది. దేశవ్యాప్తంగా శుక్రవారం (అక్టోబర్ 13)న ఈ సినిమా పండగను జరుపుకోనున్నారు. ఈ స్పెషల్‌ డే రోజున సినిమా ప్రియులకు మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ గొప్ప ఆఫర్‌ను అందిస్తోంది . జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా గతేడాది మల్టీప్లెక్స్‌ టికెట్ ధరను రూ.75గా నిర్ణయించారు. దీంతో మల్టీప్లెక్స్‌లు హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో కళకళలాడాయి. ఈ ఏడాది కూడా జాతీయ సినిమా దినోత్సవంలో భాగంగా మల్టీప్లెక్స్‌ టికెట్ ధరను రూ.99గా నిర్ణయించారు

National Cinema Day: రేపే సినిమా పండగ.. రూ.99 లకే మల్టీప్లెక్స్‌ మూవీ టికెట్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
Multiplex Theatre
Follow us on

జాతీయ సినిమా దినోత్సవం వచ్చేసింది. దేశవ్యాప్తంగా శుక్రవారం (అక్టోబర్ 13)న ఈ సినిమా పండగను జరుపుకోనున్నారు. ఈ స్పెషల్‌ డే రోజున సినిమా ప్రియులకు మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ గొప్ప ఆఫర్‌ను అందిస్తోంది . జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా గతేడాది మల్టీప్లెక్స్‌ టికెట్ ధరను రూ.75గా నిర్ణయించారు. దీంతో మల్టీప్లెక్స్‌లు హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో కళకళలాడాయి. ఈ ఏడాది కూడా జాతీయ సినిమా దినోత్సవంలో భాగంగా మల్టీప్లెక్స్‌ టికెట్ ధరను రూ.99గా నిర్ణయించారు. దీని ద్వారా మల్టీప్లెక్స్‌లలో సరసమైన ధరకే సూపర్‌ హిట్‌ సినిమాలు చూసే అవకాశం సినిమా లవర్స్‌కు లభించనుంది. పీవీఆర్, సినీ పోలిస్, ఐనాక్స్, సిటీప్రైడ్, మిరాజ్, మూవీ టైమ్, ఏషియన్ వంటి మల్టీప్లెక్స్‌లు ఈ ఆఫర్‌ను అందించనున్నాయి. అయితే ఆయా రాష్ట్రాలకు సంబంధించి టికెట్ల ధరల్లో కొద్దిగా మార్పులు ఉండవచ్చు. కాగా గతేడాది నేషనల్‌ సినిమా డే సందర్భంగా
మన దేశంలో మల్టీ ప్లెక్స్‌ టికెట్టు ధర రూ. 75 గా నిర్ణయించారు. పండుగ సినిమా ప్రదర్శనలు ఉదయం 6 గంటలకు ప్రారంభమైనప్పుడు రోజంతా, 65 లక్షల మంది ప్రేక్షకులు మల్టీప్లెక్సుల్ని సందర్శించినట్టు ఎంఏఐ అంచనా వేసింది. ఈ ఒక్కరోజే రూ. 48 కోట్లు కలెక్షన్లు వచ్చాయి. దాదాపు అన్ని షోలు 85-90% ఆక్యుపెన్సీతో హౌస్‌ఫుల్‌గా సాగాయి. మరి ఈసారి ఎన్ని కోట్ల వసూళ్లు వస్తాయో చూడాలి.

కాగా గతేడాది సినిమా పండుగలో తెలుగు రాష్ట్రాలు పాల్గొన లేదు. కొన్ని కారణాలతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలను మినహాయించారు. మరి ఈసారైనా సినిమా ఆఫర్‌ తెలుగు రాష్ట్రాలకు వర్తిస్తుందా? లేదా?అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాగా థియేటర్లలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. షారుఖ్‌ ఖాన్‌ జవాన్‌తో పాటు రామ్‌ పోతినేని స్కంద, మ్యాడ్‌, మిషన్ రాణిగంజ్, చంద్రముఖి 2, సుధీర్‌ బాబు మామా మశ్చీంద్ర, కిరణ్‌ అబ్బవరం రూల్స్‌ రంజన్‌ సినిమాలు ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇక శుక్రవారం కూడా పలు సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టనున్నాయి. అందులో న‌య‌న‌తార‌, జ‌యంర‌విల డబ్బింగ్‌ మూవీ గాడ్‌, మధుర పూడి గ్రామం, సగిలేటి కథ, రాక్షస కావ్యం, నీతో నేను, తంతిరం వంటి సినిమాలు ప్రదర్శితం కానున్నాయి.

ఇవి కూడా చదవండి

దేశవ్యాప్తంగా 4000 కు పైగా మల్టీప్లెక్స్ లు, సినిమా థియేటర్లలో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.