AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie : ఏం ప్లాన్ చేశారు సామీ.. పెద్ది కోసం రంగంలోకి కల్ట్ హీరోయిన్.. ఇక స్పెషల్ సాంగ్ రచ్చ రచ్చే..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ పై మరో ఆసక్తికర న్యూస్ వినిపిస్తుంది.

Peddi Movie : ఏం ప్లాన్ చేశారు సామీ.. పెద్ది కోసం రంగంలోకి కల్ట్ హీరోయిన్.. ఇక స్పెషల్ సాంగ్ రచ్చ రచ్చే..
Ram Charan
Rajitha Chanti
|

Updated on: Mar 22, 2026 | 4:19 PM

Share

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పెద్ది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ హైప్ ఉన్న సినిమా ఇది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈసినిమా పై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలకపాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే విలక్షణ నటుడు జగపతి బాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇదివరకే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. మరోవైపు పెద్ది చిత్రంలోని సాంగ్స్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ఈ సినిమాలో ఊర మాస్ లుక్ లో కనిపించనున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ సినిమాను నుంచి విడుదలైన చికిరీ చికిరీ, రైరై రారా పాటలు మరింత హైప్ పెంచేశాయి.

ఎక్కువ మంది చదివినవి : Suddala Ashok Teja : ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.. రచయిత సుద్దాల అశోక్ తేజ..

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందట. అయితే ఈ పాట కోసం టాలీవుడ్ కల్ట్ హీరోయిన్ ను ఎంపిక చేశారట మేకర్స్. ఏఆర్ రెహమాన్ క్రియేట్ చేసిన ఈ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ను సెలక్ట్ చేశారట. ఈ సినిమాకు అటు మృణాల్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. అలాగే ఈ పాటలో మృణాల్, రామ్ చరణ్ ఇద్దరితోపాటు జాన్వీ కపూర్ సైతం ఎంట్రీ ఉంటుందని సమాచారం. ఈ పాటకు థియేటర్లలో బాక్సులు షేక్ అవ్వడం ఖయమని అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఎక్కువ మంది చదివినవి : RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఉప్పెన సినిమా తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సెకండ్ మూవీ ఇదే. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మెగా అభిమానులలో మంచి హైప్ నెలకొంది.

ఎక్కువ మంది చదివినవి : హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దని చెప్పింది.. బుల్లితెరపై గ్లామర్ అరాచకం..

ఎక్కువ మంది చదివినవి : Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..

Follow Us