కోలీవుడ్ పిలుస్తుంది.. తమిళ్ లో ఛాన్స్ లు అందుకుంటున్న మృణాల్

Rajeev 

22  march 2026

మృణాల్ ఠాకూర్.. తెలుగు తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బాలీవుడ్ అందాల తార.

తొలి చిత్రం సీతారామం సినిమాతో మృణాల్ ఒక్కసారిగా స్టార్ గా మారిపోయింది. ఈ సినిమాలో సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది.

సీతారామం సినిమా మంచి విజయం అందుకున్న తర్వాత మృణాల్ కు క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టాయి.

సీతారామం సినిమా తర్వాత నానితో కలిసి హాయ్ నాన్న అంటూ మరో క్లాసిక్ హిట్ అందుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

హాయ్ నాన్న సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడు టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.

కానీ ఆతర్వాత విజయ్ దేవరకొండతో కలిస్ చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఈ అమ్మడి సినిమాల స్పీడ్ కు బ్రేక్ పడింది. 

ప్రస్తుతం డెకాయిట్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంటుంది ఈ వయ్యారి భామ.