కోలీవుడ్ పిలుస్తుంది.. తమిళ్ లో ఛాన్స్ లు అందుకుంటున్న మృణాల్

Rajeev 

22  march 2026

 తెలుగులో ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయ్యింది మృణాళిని రవి. వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ సినిమాతో పరిచయం అయ్యింది. 

గద్దల కొండ గణేష్ సినిమాలో బుజ్జమ్మ పాత్రలో తన క్యూట్ పర్ఫామెన్స్ తో కవ్వించింది అందాల భామ మృణాళిని రవి.

ఈ అమ్మడు 2019లో విడుదలైన సూపర్‌ డీలక్స్‌ సినిమా ద్వారా సినీరంగం లోకి అడుగు పెట్టింది. ఆతర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది.

మొదట్లో మృణాళిని రవి సోషల్ మీడియాలో డ‌బ్‌స్మాష్‌తో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యింది.

ఆ వీడియోలు చూసిన త్యాగరాజన్‌ కుమార్‌ రాజా ఆమెకు సూపర్‌ డీలక్స్‌ సినిమాలో నటించే అవకాశం కల్పించాడు. అలా హీరోయిన్ గా మారింది.

ఆతర్వాత వరుసగా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఛాన్స్ లు అందుకుంటుంది. 

ఇక తెలుగులో ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మాయ మశ్చేంద్ర, లవ్ గురు సినిమాల్లో నటించింది. కానీ ఇప్పుడు ఈ అమ్మడు ఎక్కడా కనిపించడం లేదు.