AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Serial Actress Swapna : కులం తక్కువదాన్నే నన్ను అవమానించారు.. వ్యభిచారిని అని వాళ్లే డిక్లేర్ చేశారు.. సీరియల్ నటి స్వప్న ఆవేదన..

సినీరంగుల ప్రపంచం కనిపించినంత అందంగా ఉండదు. నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తారలు పడే కష్టాలు అంత ఇంతా కాదు. ఎన్నో అవమానాలు, సవాళ్లను దాటుకుని.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సెలబ్రెటీలుగా కొనసాగుతుంటారు. తాజాగా సీరియల్ నటి స్వప్న తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు బయటపెట్టింది.

Serial Actress Swapna : కులం తక్కువదాన్నే నన్ను అవమానించారు.. వ్యభిచారిని అని వాళ్లే డిక్లేర్ చేశారు.. సీరియల్ నటి స్వప్న ఆవేదన..
Swapna
Rajitha Chanti
|

Updated on: Mar 22, 2026 | 3:41 PM

Share

బుల్లితెర ప్రేక్షకులకు చెల్లి స్వప్న గురించి సుపరిచితమే. దశాబ్దాలుగా టీవీ రంగంలో ఎన్నో సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే స్మాల్ స్క్రిన్ పై తన నటనతో అలరించే స్వప్న జీవితంలో ఎన్నో కష్టాలు.. అవమానాలు దాగి ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులను చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తనను ఆదరిస్తారని రైటర్స్ అసోసియేషన్ లో చేరితే తనపై వ్యభిచారి అనే ముద్ర వేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె పొదరిల్లు సీరియల్లో నటిస్తుంది. అంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితం అమృతం, గృహలక్ష్మి, ఉమ్మడి కుటుంబం, తూర్పు వెళ్లే రైలు, మనసు మమత , చంద్రముఖి వంటి సీరియల్స్ చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Suddala Ashok Teja : ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.. రచయిత సుద్దాల అశోక్ తేజ..

తాను ఇప్పటివరకు ఎంత నరకం చూడాలో అంత నరకం చూశానని.. తాను రైటర్స్ అసోసియేషన్ లో చేరడమే పెద్ద తప్పు అని.. అక్కడ తనను ఎన్నో మాటలు అన్నారని చెప్పుకొచ్చింది. తనను కులం తక్కువది అని అన్నారని.. తనకు గౌరవం దక్కలేదని చెప్పుకొచ్చారు. రైటర్స్ అసోసియేషన్ లోని కొందరి మాటలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని సిద్ధమయ్యానని.. ఇప్పటికీ కూడా మానసికంగా చాలా డిస్ట్రబ్ అయ్యానని.. అదే డిప్రెషన్ లో చనిపోయినా.. ఎవరైనా చంపేసినా అది వాళ్లే అవుతుందని చెప్పుకొచ్చింది. తనను కులం పేరుతో అవమానించడమే కాకుండా వ్యభిచారి అని అన్నారని తెలిపింది.

ఎక్కువ మంది చదివినవి : RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..

తనకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చానని.. తప్పుడు పని చేసి సెటిల్ కావాలనుకుంటే ఎప్పుడో చేసేదాన్ని కదా.. అప్పుడే సెటిల్ అయ్యేదాన్ని కాదా అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. వాళ్లు అన్న మాటలకు నేను కుంగిపోవడం లేదు. ఎందుకుంటే నా దేవుడు నాకు ఇవ్వాల్సిన బలాన్ని ఇస్తాడు. వాళ్లు అన్నంత మాత్రాన నేనేం చెడిపోలేదు. చెడిపోను కూడా.. నాకు ఆ పని అలవాటు లేదు. దాని కారణంగా నాకు ఎలాంటి ఆస్తులు, స్థలాలు ఇవ్వలేదు. ఇప్పటికీ నన్ను ఏదోక మాట అంటుంటారు అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఎక్కువ మంది చదివినవి : హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దని చెప్పింది.. బుల్లితెరపై గ్లామర్ అరాచకం..

ఎక్కువ మంది చదివినవి : Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..

Follow Us
సీరియల్ నటి స్వప్న జీవితంలో ఇన్ని కష్టాలా.. ? కులం పేరుతో అవమానాల
సీరియల్ నటి స్వప్న జీవితంలో ఇన్ని కష్టాలా.. ? కులం పేరుతో అవమానాల
బొట్టు పెట్టుకుంటున్నారా?ఏ వేలితో పెట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉంటదంట
బొట్టు పెట్టుకుంటున్నారా?ఏ వేలితో పెట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉంటదంట
ఏప్రిల్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇదే..ఆ విషయంలో వీరే గ్రేట్
ఏప్రిల్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇదే..ఆ విషయంలో వీరే గ్రేట్
ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి
ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి
69 బంతులు..21 సిక్సర్లు..195 రన్స్..మైదానంలో స్వాస్తిక్ విధ్వంసం
69 బంతులు..21 సిక్సర్లు..195 రన్స్..మైదానంలో స్వాస్తిక్ విధ్వంసం
వార్ ఎఫెక్ట్.. వాటిని వెంట తెచ్చుకునేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల
వార్ ఎఫెక్ట్.. వాటిని వెంట తెచ్చుకునేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల
చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.!
చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.!
ఐపీఎల్ 2026 కు ముందు సన్‌రైజర్స్ విధ్వంసం
ఐపీఎల్ 2026 కు ముందు సన్‌రైజర్స్ విధ్వంసం
ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఇక బాదుడే బాదుడు.. పెట్రోల్ సెగతో..
ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఇక బాదుడే బాదుడు.. పెట్రోల్ సెగతో..
చిరుతపులి, సింహం తలపడితే ఎలా ఉంటుందో తెలుసా..? వైరల్ వీడియో
చిరుతపులి, సింహం తలపడితే ఎలా ఉంటుందో తెలుసా..? వైరల్ వీడియో