AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి ఏమోగానీ.. రూమర్సే నాకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయి.. స్టార్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్

సెలబ్రెటీల గురించి సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా ఓ స్టార్ హీరోయిన్ పెళ్లి గురించి వార్తలు షికారు చేస్తున్నాయి. ఓ స్టార్ హీరో తో ఆమె డేటింగ్ చేస్తుందని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.

పెళ్లి ఏమోగానీ.. రూమర్సే నాకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయి.. స్టార్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 16, 2026 | 11:30 AM

Share

సినీ సెలబ్రెటీల ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఆ హీరో ఈ హీరోయిన్ తో ప్రేమలో పడిందని.. ఆ హీరోయిన్ ఈ హీరోతో చక్కర్లు కొడుతుందని అంటూ రూమర్స్ తెగ వినిపిస్తుంటాయి. ఇటీవల సెలబ్రెటీల పెళ్లి వార్తలు రెగ్యులర్ గా సర్క్యులేట్ అవుతున్నాయి. ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందని వార్తలు వినిపిస్తుంది. ఈ అమ్మడు తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. 33 ఏళ్ల ఆ ముద్దుగుమ్మ ఇప్పుడు ఓ హీరోతో ప్రేమలో ఉందని. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తల పై స్పందించింది ఆ అందాల తార. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఓయమ్మో..! కుష్బూ కూతురు అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు.. త్వరలోనే ఎంట్రీ

ఆ అందాల భామ ఎవరో కాదు మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హాయ్ నాన్న మూవీతో మరో హిట్టు అందుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం అడివి శేష్ జోడిగా డెకాయిట్ చిత్రంలో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. కొన్ని రోజులుగా మృణాల్ పెళ్లి గురించి రూమర్స్ వినిపిస్తున్నాయి. కోలీవుడ్ హీరో ధనుష్ తో ఈ అమ్మడు ప్రేమలో ఉందని సమాచారం. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రూమర్స్ పై ఇద్దరూ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. నెట్టింట పెళ్లి వార్తలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మృణాల్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

సినిమా సెట్‌లో ఆ హీరోని నిజంగానే కొట్టా..! షాకింగ్ విషయం చెప్పిన నటుడు

పెళ్లి రూమర్స్ పై మృణాల్ స్పందించింది. రూమర్సే నాకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయి అని మృణాల్ తెలిపింది. మృణాల్ మాట్లాడుతూ.. నా పర్సనల్ లైఫ్ పై జరుగుతున్న ప్రచారం చూసి నేను అసలు అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను పీఆర్ టీంను కోట్లు ఖర్చుపెట్టి పెట్టుకున్న సరే నాకు ఇంత పాపులారిటీ, పబ్లిసిటీ వచ్చేది కాదు. నాకు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారు. అందుకే నా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారందరికీ కూడా నేను పెద్ద థ్యాంక్స్ చెబుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఫిబ్రవరి 14 డేట్ ను చూస్తుంటే నాకు ఏప్రిల్ ఒకటిలా అనిపిస్తోంది. ఎందుకంటే ఆ రోజు ఫూల్స్ డే కాబట్టి.. ధనుష్ తో పెళ్లి అంటూ వస్తున్న వార్తలు ఫేక్. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నేనే చెప్తా.. నాకు పెళ్లి నిశ్చయమైతే కచ్చితంగా మీతో ఆ విషయాన్ని పంచుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. మృణాల్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చదివింది 4వ తరగతి..! 14ఏళ్లకే పెళ్లి.. 450కి పైగా సినిమాలు..!! స్టార్ హీరోలకు చమట్లు పట్టించింది

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూమర్సే నాకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయి..
రూమర్సే నాకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయి..
ఇంటికి కాదు, సూర్యుడికి అద్దె.. సన్‌లైట్ కోసమే రూ.80 వేల కిరాయి!
ఇంటికి కాదు, సూర్యుడికి అద్దె.. సన్‌లైట్ కోసమే రూ.80 వేల కిరాయి!
Chanakya Niti: చాణక్యుడి 5 సిక్రెట్ టిప్స్.. జీవితంలో విజయం..
Chanakya Niti: చాణక్యుడి 5 సిక్రెట్ టిప్స్.. జీవితంలో విజయం..
టీమిండియా @ 16.. పాక్‌కే కాదు ఆసీస్‌కు ఇచ్చిపడేసిన సూర్యసేన
టీమిండియా @ 16.. పాక్‌కే కాదు ఆసీస్‌కు ఇచ్చిపడేసిన సూర్యసేన
ఉత్తరాఖండ్‌లో పుట్టి, నేపాల్‌తో సహజ సరిహద్దుగా ప్రవహించే నల్ల నది
ఉత్తరాఖండ్‌లో పుట్టి, నేపాల్‌తో సహజ సరిహద్దుగా ప్రవహించే నల్ల నది
సూర్యగ్రహణంతో ఆ రాశుల వారి దశ తిరగడం ఖాయం.. మీ రాశి ఉందా?
సూర్యగ్రహణంతో ఆ రాశుల వారి దశ తిరగడం ఖాయం.. మీ రాశి ఉందా?
శక్తివంతమైన గ్రహాల కలయిక.. ఈ రాశులవారికి గుడ్ టైమ్ స్టార్ట్, ఏది
శక్తివంతమైన గ్రహాల కలయిక.. ఈ రాశులవారికి గుడ్ టైమ్ స్టార్ట్, ఏది
రైతులకు ప్రభుత్వం నుంచి మరో తీపికబురు
రైతులకు ప్రభుత్వం నుంచి మరో తీపికబురు
ఓరేయ్ ఆజామూ.. బ్యాగులు సర్దేయ్ రోయ్.. ‘రియల్ ధురంధర్’ అంటూ
ఓరేయ్ ఆజామూ.. బ్యాగులు సర్దేయ్ రోయ్.. ‘రియల్ ధురంధర్’ అంటూ
ఈ వీడియో చూస్తే స్టన్ అవ్వాల్సిందే.. అడవి రాజుకే సవాల్ విసిరిన..
ఈ వీడియో చూస్తే స్టన్ అవ్వాల్సిందే.. అడవి రాజుకే సవాల్ విసిరిన..