Mrunal Thakur: కోలీవుడ్ లోనూ హవా చూపిస్తున్న మృణాల్.. ముగ్గురు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్

హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది మృణాల్. ఆతర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. బ్యాక్ టు బ్యాక్ తెలుగులో క్రేజీ ఆఫర్స్ అందుకుంది మృణాల్. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే టాలీవుడ్ లోనూ ఆఫర్స్ అందుకుంది మృణాల్

Mrunal Thakur: కోలీవుడ్ లోనూ హవా చూపిస్తున్న మృణాల్.. ముగ్గురు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్
Mrunal Takur

Updated on: Feb 17, 2024 | 8:44 AM

ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిన హీరోయిన్స్ చాల మంది ఉన్నారు. అలాగే బాలీవుడ్ నుంచి వచ్చిన మృణాల్ కూడా టాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది మృణాల్. ఆతర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. బ్యాక్ టు బ్యాక్ తెలుగులో క్రేజీ ఆఫర్స్ అందుకుంది మృణాల్. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే టాలీవుడ్ లోనూ ఆఫర్స్ అందుకుంది మృణాల్. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే కోలీవుడ్ లోనూ సినిమా ఛాన్స్ లు అందుకుంటుంది.

ఇప్పుడు ఈ చిన్నదానికి రెండు భారీ సినిమాల్లో ఛాన్స్ లు అందుకుందని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, శింబు సరసన అవకాశాలు అందుకుందట మృణాల్. ఇటీవల విడుదలైన మార్క్‌ ఆంటోని చిత్రం ఫేమ్‌ ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో అజిత్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మృణాల్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఈ సినిమా ఛాన్స్ వస్తే నిజంగా ఈ అమ్మడి రేంజ్ మారిపోతుంది.

అలాగే స్టార్ హీరో శివకార్తికేయన్ మురగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో మృణాల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే శింబు హీరోగా స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమాలోనూ మృణాల్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇలా వరుస సినిమాలతో తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ బిజీగా మారిపోయింది మృణాల్. తెలుగులో ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది ఈ చిన్నది.

మృణాల్ ఠాకూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మృణాల్ ఠాకూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.