జండాపండగను దేశం మొత్తం ఘనంగా జరుపుకుంది. జాతీయ పతాకాన్ని ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు దేశ ప్రజలు. సెలబ్రెటీలు కూడా స్వాతంత్రదినోత్సవంను గ్రాండ్ గా జరుపుకున్నారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే త్రివర్ణ పతాకంతో స్వాతంత్రదినోత్సవం శుభాకాంక్షలు తెలిపింది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆమెకు విషెస్ తెలిపారు.
లేటెస్ట్ సేసన్సేషన్ శ్రీలీల కూడా సోషల్ మీడియా వేదికగా స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ నమిత కూడా 77వ స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది భర్తతో కలిసి ఆమె జెండాతో ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
క్రేజీ బ్యూటీ రాశి ఖన్నాకుడా ప్రజలకు సోషల్ మీడియా వేదికగా దేశ 77వ స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. మా తుజే సలాం అంటూ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది రాశి.
బిగ్ బాస్ బ్యూటీ దివి కూడా స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది దివి. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
స్టార్ యాంకర్ సుమ కనకాల కూడా జెండాతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. జెండాతో సెల్ఫీ దిగి.. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు సుమ కనకాల..
టాప్ బ్యూటీ తమన్నా న్యూ జెర్సీ లో భారతీయుల మధ్య జెండా పండుగను జరుపుకుంది’. విదేశంలో స్వాతంత్రదినోత్సవంను గ్రాండ్ గా జరుపుకుంది తమన్నా.. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి