Monalisa: మేం ఆత్మహత్య చేసుకుంటాం.. మోనాలిసా దంపతుల సంచలన ప్రకటన.. ఏం జరిగిందంటే?

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాతో ఫేమస్ అయిన మోనాలిసా ఇప్పుడు వరుసగా వార్తల్లో నిలుస్తోంది. సినిమాలు, యాడ్స్ లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న ఆమె ఇటీవల ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

Monalisa: మేం ఆత్మహత్య చేసుకుంటాం.. మోనాలిసా దంపతుల సంచలన ప్రకటన.. ఏం జరిగిందంటే?
Monalisa and her husband Farman Khan

Updated on: Mar 26, 2026 | 7:55 AM

ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాలో పూసలమ్ముకుంటూ ఫేమస్ అయిన మోనాలిసా ఇటీవల వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకుందామె. అయితే వీరిద్దరి వివాహంపై నెట్టింట దుమారం రేగుతోంది. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. చివరకు మోనాలిసా తల్లిదండ్రులే ఈ పెళ్లి చెల్లదంటున్నారు. ఇక మోనాలిసా మైనర్ అని, ఆమెతో సినిమా చేస్తోన్న డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. అన్నిటికీ మించి మోనాలిసా- ఫర్మాన్ ఖాన్ వివాహం లవ్ జిహాద్ లో భాగమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఫర్మాన్ ఖాన్ మోనాలిసాను తప్పుదోవ పట్టించి వివాహం చేసుకున్నాడని అంటున్నారు. తాజాగా ఈ ఆరోపణలపై మరోసారి స్పందించారు మోనాలిసా దంపతులు. తమ వివాహాన్ని లవ్ జిహాద్ అని పిలవవద్దని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేశారీ కొత్త దంపతులు.

లవ్ జిహాద్ ఆరోపణలపై మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ దంపతులు ఎట్టకేలకు మౌనం వీడారు. వారిద్దరూ విలేకరుల సమావేశం నిర్వహించి, తాము ఎదుర్కొంటున్న కష్టాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఫర్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. “నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను, ముస్లిం మతానికి చెందినవాడిని. ఇది తప్పా? చాలా మంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. ప్రేమించడం తప్పా? మమ్మల్ని ఇంతలా హింసిస్తారా? మా దగ్గర డబ్బు లేదు. డబ్బు లేకుండా ఎలా బతుకుతాం? పని చేయకపోతే ఏం తింటాం? మా దారిన మమ్మల్ని వదిలేయండి. మీరు ఇలాగే వేధిస్తే మేం ఆత్మహత్య చేసుకుంటాం. అదొక్కటే మాకు గతి’

‘మా పెళ్లి గుడిలో జరిగింది. నాకు శ్రీ నారాయణ గురూజీ అంటే బాగా నమ్మకం. ఎవరైనా ఆయన గుడికి వెళ్లి పెళ్లి చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు’ అని ఫర్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్ లేదా కేరళ ప్రభుత్వాలు మాకు సహాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మోనాలిసా కూడా హెచ్చరించింది. అలాగే బాలీవుడ్ డైరెక్టర సరోజ్ మిశ్రాపై కూడా సంచలన ఆరోపణలు చేసింది మోనాలిసా. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us