L2 Empuraan OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న మోహన్ లాల్ సూపర్ హిట్.. ఎల్ 2: ఎంపురాన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

మలయాళీ చిత్రపరిశ్రమలో ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ఎల్ 2: ఎంపురాన్ ఒకటి. స్టార్ హీరోస్ మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఓవైపు వివాదాలు నడుస్తున్నప్పటికీ భారీ కలెక్షన్స్ రాబట్టింది ఈ చిత్రం. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

L2 Empuraan OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న మోహన్ లాల్ సూపర్ హిట్.. ఎల్ 2: ఎంపురాన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
L2 Empuraan

Updated on: Apr 17, 2025 | 9:05 PM

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ ఎల్ 2: ఎంపురాన్. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వం వహించగా.. గతంలో హిట్ అయిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్ ఇది. భారీ అంచనాల మధ్య మార్చి 27న విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అయితే ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలుచోట్ల ఈమూవీని బ్యాన్ చేయాలంటూ డిమాండ్స్ సైతం వచ్చాయి. అయితే ఈ మూవీ కాంట్రవర్సీపై మోహన్ లాల్ సైతం క్షమాపణలు చెప్పారు. ఓవైపు వివాదాలు నడుస్తున్నప్పటికీ సినిమాకు వచ్చే రెస్పాన్స్ ఏమాత్రం తగ్గలేదు. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.

తాజాగా ఎల్ 2: ఎంపురాన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 24 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగుతోపాటు మలయాళం, కన్నడ, తమిళం భాషలలో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ఎల్ 2: ఎంపురాన్ సినిమా అడియన్స్ అంచనాలు మించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం నాలుగున్నర రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళీ మూవీగా అరుదైన రికార్డ్ సృష్టించింది. 2002లో గుజరాత్ లో చోటు చేసుకున్న ఘటనల ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు రాజకీయంగా చర్చనీయాశంగా మారాయి.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?