Mohan Babu : ‘సన్ ఆఫ్ ఇండియా’తో మేస్ట్రో మ్యూజిక్ డైరెక్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దాదాపు నలభై ఏళ్లుగా నటుడిగా, నిర్మాతగా, సమర్పకుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపించారు.. కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించారు ఆయన ...
Mohan Babu- Maestro Ilayaraja : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దాదాపు నలభై ఏళ్లుగా నటుడిగా, నిర్మాతగా, సమర్పకుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపించారు.. కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించారు ఆయన. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ముందుకెళ్తున్నారు మోహన్ బాబు. ఆ మధ్య వరస పెట్టి సినిమా చేసుకుంటూ వచ్చిన ఈ సీనియర్ హీరో.. ఇటీవలి కాలంలో చాలా తక్కువ చిత్రాల్లోనే నటిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆయన ఓ సందేశాత్మక చిత్రం చేస్తున్నారు.
సుదీర్ఘ విరామం తర్వాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సూర్య నటించిన ఆకాశం నీహద్దురా.. సినిమాలో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. రచయిత డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మేస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం అందిస్తోన్న ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం 11వ శతాబ్దంలో వేదాంత దేశిక రాసిన ‘రఘువీర గద్యం’ని రీమిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీరాముడి ఘనతను చాటిచెప్పే రఘువీర గద్యాన్ని రీమిక్స్ చేయవలసిందిగా మోహన్ బాబు సంగీత దర్శకుడు ఇళయరాజాను అభ్యర్ధించగా.. అందుకు ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో జరిగాయి. ఇళయరాజా, మోహన్ బాబు కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :
K.G.F Chapter 2 : భారీ ధరకు ‘కేజీఎఫ్’ 2 తమిళ రైట్స్.. దక్కించుకుంది ఎవరో తెలుసా..