K.G.F Chapter 2 : భారీ ధరకు ‘కేజీఎఫ్’ 2 తమిళ రైట్స్.. దక్కించుకుంది ఎవరో తెలుసా..

కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా మూవీ కేజీఎఫ్‌ చాప్టర్‌ 2. 2018లో బాక్సాఫీస్‌ తోపాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా.

K.G.F Chapter 2 : భారీ ధరకు 'కేజీఎఫ్' 2 తమిళ రైట్స్.. దక్కించుకుంది ఎవరో తెలుసా..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 21, 2021 | 12:25 PM

K.G.F Chapter 2 : కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా మూవీ కేజీఎఫ్‌ చాప్టర్‌ 2. 2018లో బాక్సాఫీస్‌ తోపాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా. ఈ సినిమాలో రాకీ భాయ్‌ను ఢీ కొట్టేందుకు అధీరాగా వస్తున్నాడు బాలీవుడ్‌ హీరో సంజయ్‌దత్‌. మరో బాలీవుడ్ నటి రవీనాటాండన్ కీలక పాత్రలో నటిస్తుంది. కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 1 భారీ విజ‌యం సాధించ‌డంతో ఛాప్ట‌ర్ 2పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జ‌రుగుతుంది.

కేజీఎఫ్ చాప్టర్ -1 పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో దేశం మొత్తం కేజీఎఫ్-2 కోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తోంది.  ఈ సినిమా చిత్రీకరణ విషయంలో చిత్రబృందం ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించారని తెలుస్తుంది. కాగా ఈ సినిమా తమిళనాడు రైట్స్ ను డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ భారీ ఆఫర్ ఇచ్చి మరీ కొనుగోలు చేసిందని తెలుస్తుంది. హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్ 2 జూలై 16న విడుదల కానుంది. కాగా సినిమా విడుద‌లకు ముందే ఈ మూవీ పెట్టిన ఖ‌ర్చు రాబ‌ట్ట‌నున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌కాశ్ రాజ్, రావు ర‌మేష్ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kareena Kapoor second baby : పండంటి బిడ్డకు జన్మనించిన బాలీవుడ్ బ్యూటీ.. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ జంటకు బాబు..

RRR Movie : చివరిదశలో ఆర్ఆర్ఆర్ షూటింగ్.. సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచేస్తున్న దర్శకధీరుడు..